కృష్ణ

నిరంతర శిక్షణ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : నిరంతర శిక్షణ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందని, సు శిక్షుతులైన సిబ్బంది సమాజానికి మె రుగైన సేవలందించి శ్రేయోరాజ్యానికి దోహదపడతారని పదోన్నతి శిక్షణ ముగించుకుని వచ్చిన సిబ్బందినుద్దేశించి మాట్లాడారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎఎస్పీ సాయికృష్ణ మాట్లాడుతూ 1992, 93, 98 బ్యా చ్‌లకు చెందిన కానిస్టేబుళ్లుగా తమ సేవలను సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖకు అందించి పదోన్నతిగా హెడ్ కానిస్టేబుల్‌గా పొందబోవడం ఆనందదాయకమన్నారు. పదోన్నతులు మ రింత బాధ్యతను పెంచుతాయని, వృ త్తిపట్ల అంకిత భావంతో మెలగాలన్నా రు. వృత్తిలో నిజాయితీ గా ఉండాలని ఎఎస్పీ సూచించారు. ప్రభుత్వ పరంగాను పోలీస్ శాఖకు పదోన్నతుల పరంగా సానుకూలంగా ఉన్నందున త్వరలోనే మరింత మంది పదోన్నతి పొందగలరని ఆశాభావం వ్యక్తం చే శారు. జిల్లా వ్యాప్తంగా 36 మంది శి క్షణ పూర్తి చేసుకోగా, అ ందులో నలుగురు మహిళలు ఉం డట ం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ ర ఘు, ఆర్‌ఐ పి కృష్ణంరాజు, ఆర్‌ఎస్‌ఐ సతీష్, సి బ్బంది పాల్గొన్నారు.
శివ నామస్మరణలతో మార్మోగిన శైవాలయాలు
కూచిపూడి : కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా మొవ్వ మండలంలోని శైవాలయాలు శివనామస్మరణలతో మార్మోగాయి. తెల్లవారుజాము నుండే పరమశివునికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు పండితుల వేద మంత్రాలు మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొవ్వ శ్రీ భీమేశ్వరాలయం, పెదపూడి, అయ్యంకి తదితర గ్రామాల్లోని శైవాలయాలు భక్తుల శివనామస్మరణలతో మార్మోగాయి.

పేదరికంపై గెలుపు కార్యక్రమానికి
బస్సులను ప్రారంభించిన చైర్మన్ బాబాప్రసాద్
మచిలీపట్నం : విజయవాడ ‘ఇందిరాగాంధీ స్టేడియం’లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ‘పేదరికంపై గెలుపు’ కార్యక్రమానికి పట్టణం నుండి ఉచిత బస్సులను మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెడ్‌లో ఉన్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారన్నారు. ఎనిమిది లక్షల మందికి రూ.4వేల కోట్లతో ఆర్థిక ససాయం, పనిముట్లు అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాధం, కమీషనర్ పిజె సంపత్ కుమార్, అసిస్టెంట్ కమీషనర్ కృష్ణారావు, సిఎంఎం రవి కుమార్, పిఓ రాజేంద్రప్రసాద్, సిఓలు పాల్గొన్నారు. కవులూరులో ఎయిమ్స్ విద్యార్థుల ర్యాలీ
జి.కొండూరు : ధన్వంతరీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా సోమవారం కవులూరులో మంగళగిరి ఎయిమ్స్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు 50 మంది ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో నినాదాలు చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో గ్రామస్తులకు మధుమేహం పరీక్షలు నిర్వహించారు. అనారోగ్య రుగ్మతలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను చైతన్యపరిచారు. మద్యపానం, ధూమపానం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఆహారపు అలవాట్లలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్, ధన్వంతరీ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ జువ్వా గౌతమ్‌కుమార్, వాలంటీర్ ఈలప్రోలు సీతారామయ్య, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.