కృష్ణ

‘గజ’ తుఫాన్ హెచ్చరికలతో గజగజలాడుతున్న రైతన్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : ‘గజ’ గజ తుఫాన్ ప్రకటనలు రైతులను గడగడలాడిస్తున్నాయి. ఏపుగా పెరిగి ఖరీఫ్ వరి పైరు కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో ‘గజ’ తుఫాన్ హెచ్చరికలు రైతన్నల వెన్నులో ఒణుకు పుట్టిస్తోంది. 2013 నవంబర్ నెలలో ఏపుగా పెరిగిన వరి పైరు తుఫాన్ ప్రభావంతో చాపచుట్టగా పడిపోయి నీట మునిగి రైతన్నల కష్టం నీటిపాలైన చేదు అనుభవాలను రైతులు గుర్తుకు తెచ్చుకుని గజగజలాడుతున్నారు. తేలికపాటి గాలులకే మొవ్వ మండలంలోని పలు గ్రామాల్లోని వరి పంట ఒరిగిపోవటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారి తమిళనాడుతో పాటు దక్షిణకోస్తాలో ప్రభావం చూపుతుందన్న వాతావరణ శాస్తవ్రేత్తల హెచ్చరికలకు ఆందోళన చెందుతున్న రైతులకు సోమవారం ఉదయం నుండి మారుతున్న వాతావరణం కృంగతీస్తోంది. ఈ ఏడాది వర్షపాతం తగ్గినా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి మిగులు జలాలను ప్ర భుత్వం కృష్ణానదిలోకి మళ్లించి పరివాహక ప్రాంతమైన కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రైతులకు జూలై నుండి సాగునీరు సరఫరా చేసింది. దీంతో అప్పటికే బోర్లు ద్వారా భూగర్భ జలాలను వినియోగించి వేసిన నారుమడులతో జూలై, ఆగస్టు నెలలో నాట్లు వేశారు. మండలంలోని 27,050 ఎకరాల్లో సాగు చేసిన వరి పైరులో దాదాపు వెయ్యి ఎకరాలు బంగారపు రంగుతో కళకళలాడి కోతలకు సిద్ధమైంది. దాదాపు పది రోజుల్లో కోతలు కోసేందుకు పొలాల్లో బాటలు తీసి సన్నద్ధమవుతున్న రైతులకు గజ తుఫాన్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా తుఫాన్ ప్రభావం తమపై చూపకుండా ఉండాలని రైతులు వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.