కృష్ణ

సంకల్పబలం, దైవబలంతో పోర్టును సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : అందరి సంకల్పంతో పాటు దైవబలం తోడైతే బందరు ఓడరేవును ఏ దుష్ట శక్తి అడ్డుకోలేదని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూముల కొనుగోలు ప్రక్రియకు సోమవారం శ్రీకారం చుట్టారు. భూముల కొనుగోళ్లకు ముందు ఓడరేవు నిర్మాణ పనులు, భూముల కొనుగోళ్ల ప్రక్రియ నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ ఉదయం స్థానిక కోనేరుసెంటరులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతో పాటు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, ముడ వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు హాజరయ్యారు. అన్ని మతాలకు చెందిన మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల నుండి ఎకరానికి రూ.25లక్షలు చొప్పున ముడ అధికారులు కొనుగోలు చేశారు. తొలిగా తొమ్మిది మంది రైతుల నుండి 16.30 ఎకరాల భూమిని రూ.4.5కోట్లతో ముడ అధికారులు కొనుగోలు చేశారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారాన్ని చెక్కుల రూపేణా ప్రజా ప్రతినిధులు అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో గోగులేరుకు తరలిపోయిన పోర్టును ప్రజా ఉద్యమం ద్వారా మళ్లీ బందరుకు తీసుకు వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఓడరేవు నిర్మాణం పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు తెలిపారు. ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ నెల రోజుల్లో భూముల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం పోర్టు కలను సాకారం చేస్తామన్నారు. పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. పారిశ్రామికంగా ఈ ప్రాంతం ఇతోదికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు పరిస్థితులు ఉన్నప్పటికీ పోర్టు అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ముడ ద్వారా పోర్టుకు అవసరమైన భూములను కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముడ వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

9.48లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
* జెసీ విజయకృష్ణన్

మచిలీపట్నం ప్రస్తుత ఖరీఫ్‌లో 9.48లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్ అన్నారు. సోమవారం ఆమె తన ఛాంబర్‌లో రైస్ మిల్లర్స్‌తో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 166 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మరో వంద కొనుగోలు కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సీజన్‌లో ధాన్యం మద్దతు ధర క్వింటాలు ఎ-గ్రేడ్‌కు రూ.1770లు కాగా కామన్ రకం రూ.1750లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతుకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ వెంటనే ఇవ్వాలన్నారు. వారం లోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల దిగుబడులు ఆశాజనకంగా ఉండవచ్చన్నారు. లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ జరగగలదన్న ఆశానావం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మిల్లర్ల ప్రతినిధులు సోమూరి కృష్ణాజీరావు, అనే్న శ్రీను, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.