కృష్ణ

జాతీయ రహదారి విస్తరణ భూసేకరణకు సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి: పామర్రు నుండి కత్తిపూడి జాతీయ రహదారి 165 విస్తరణ భూసేకరణ సర్వేను వేగవంతం చేయాలని గుడివాడ ఆర్డీఓ గుత్తుల వెంకట సత్యవాణి అన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణ సర్వే పనులను మంగళవారం ఆర్డీఓ సత్యవాణి తహశీల్దార్లు, సర్వేయర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గుడివాడ మండలం రామన్నపూడి నుండి ముదినేపల్లి వరకు బైపాస్, ముదినేపల్లి నుండి కైకలూరు వరకు 165 జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దార్లు, సర్వేయర్లకు సూచించారు. కలెక్టర్ ఆదేశం మేరకు పామర్రు నుండి కత్తిపూడి వరకు గల ఎన్‌హెచ్ 165 జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి గుడివాడ డివిజన్ పరిధిలో భూ సేకరణ సర్వే పనులను ఎన్‌హెచ్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. గుడివాడ డివిజన్ పరిధిలో పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో భూసేకరణను పరిశీలించటం జరిగిందని, త్వరిత గతిన పూర్తి చేసేందుకు తహశీల్దార్లు, సర్వేయర్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పెదపాలపర్రు, మండవల్లి మండలం కావలిపాడు గ్రామాల్లో జరుగుతున్న రహదారి విస్తరణ సర్వే పనులను ఆమె పర్యవేక్షించారు. ఆమె వెంట డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ఎవి రామరాజు, మండవల్లి, ముదినేపల్లి తహశీల్దార్లు మధుసూధనరావు, రాజేశ్వరి పాల్గొన్నారు.