కృష్ణ

కాంగ్రెస్‌తోనే దేశానికి దశ-దిశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్‌తోనే దశ-దిశ అని ఆ పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్రా కిరణ్ పేర్కొన్నారు. ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని చండ్రగూడెం, బొర్రగూడెం గ్రామాలలో విస్తృతంగా పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలవుతాయన్నారు. అదేవిధంగా రైతులకు రెండు లక్షల వరకూ రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా నాలుగు గ్యాస్ సిలెండర్లు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గింపు వంటి సంక్షేమ పధకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి బడా పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటూ సామాన్యుడ్ని కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావటం ద్వారా రాహుల్‌ను ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కటారి ఉమామహేశ్వరరావు, పార్టీ నేతలు గాళ్ళ సాంబశివరావు, రాష్ట్ర ఎస్టీసెల్ కన్వీనర్ కాండ్రకొండ అప్పారావు, రాము, బిసి సెల్ మండల చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్ పల్లా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.