కృష్ణ

ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, వైద్య విద్య, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆహార భద్రత శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. ఇటీవల మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫరూక్ మంగళవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్‌లతో కలిసి ఆయన ఆస్పత్రిలోని పలు విభాగాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులను తలదనే్న విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రతి పేద వాడికి నాణ్యమైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల చికిత్సకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో నర్సింగ్ కళాశాల భవనాల నిర్మాణానికి అవసరమైన అంచనాలు తయారు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో కంటే ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లా ఫ్రభుత్వ ఆస్పత్రిలో గతంలో 400 పడకలు ఉండగా ప్రస్తుతం వాటిని 500కు పెంచామన్నారు. రూ.16కోట్లతో నర్సింగ్ కళాశాలకు నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నీతిమంతులకే జనం పట్టం!

* మంత్రి దేవినేని ఉమ ఆదేశం * పంటలకు గిట్టుబాటు ధర లక్ష్యం

మైలవరం, నవంబర్ 13: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి ఉమ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు యార్డులలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులలోకి వచ్చిన ధాన్యం, పత్తి, కందులు, మినుము, పెసలు ఇతరత్రా అపరాలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు లాభం చేకూర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన పంటలను పలు కారణాలతో వెనక్కి పంపకుండా ప్రతి గింజా కొనుగోలు చేయాలని అధికారులను, పాలకవర్గాన్ని ఆదేశించారు. రైతులు తమ దిగుబడులను బయటి మార్కెట్‌లో దళారులకు అమ్ముకుని నష్టపోవద్దని హితవు పలికారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కామన్ రకం క్వింటా 1750 రూపాయలు, ఏ గ్రేడు రకం 1770 రూపాయలు, పత్తి ఏ గ్రేడు రకం 5450 రూపాయలు, మీడియం 5150 రూపాయలు, కందులు 5675 రూపాయలు, పెసలు 6975 రూపాయలు, మినుములు 5600 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
పార్టీలు, జెండాలు మార్చేవారిని తరిమికొట్టండి

పార్టీలు, జెండాలు మార్చే అవకాశవాదులను తరిమికొట్టాలని వైసీపీ నేత వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో తనపై ఓడిపోయి తర్వాత తండ్రి, కొడుకులు విడిపోయి తండ్రి తనపై ఓడిపోయి, 2014లో హత్యకేసులో నిందితునిగా ఉండి ఓటు కూడా వేయకుండా జైలులో ఉండి, అవసరం కోసం తెలుగుదేశం పంచన చేరి, అవసరం తీరాక మళ్ళీ వైసీపీ పంచన చేరి 2019లో తనపై పోటీకి వస్తున్న దొంగలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈడీ కేసులో ఎన్నో నిందితుడుగా ఉన్నావో చెప్పాలని కోరినా నేటికీ సమాదానం చెప్పలేదన్నారు. ఇటువంటి దొంగలను పక్కకు రానీయకండని మంత్రి ఉమ పిలుపునిచ్చారు. నీతికి, నిజాయితీకి కట్టుబడి పని చేస్తున్నానని, దమ్ము, ధైర్యంతోనే రాజకీయాలు చేస్తున్నానని అందుకే వరసగా నాలుగు సార్లు విజయం సాధించానని పేర్కొన్నారు. ముఖ్యంగా మైలవరంలో వరుసగా రెండోసారి పోటీ చేసి గతంలో ఎవరూ విజయం సాధించలేదని, తాను రెండోసారి పోటీ చేస్తున్నప్పుడు అందరూ తనను ఓడిపోతావని భయపెట్టినా మొక్కవోని దీక్షతో ప్రజలనే నమ్ముకుని రంగంలో దిగి విజయం సాధించి చరిత్ర తిరగరాశానని చెప్పుకొచ్చారు. దేవినేని ఉమా అడ్డ, మైలవరం తెలుగుదేశం గడ్డ అని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఉయ్యూరు వెంకట నరసింహారావు, ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, యార్డు కార్యదర్శి ఆంజనేయులు, సిసిఐ బయ్యర్ దాసరి సునీల్ కుమార్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘సుబాబుల్’ సమస్య గాలికి!

* అధికారం రాగానే ఆందోళనలు ఏమయ్యాయ? * మంత్రి ఉమపై ఉదయభాను విమర్శ

నందిగామ, నవంబర్ 13: ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని వైసీపీ విజయవాడ పార్లమెంటరీ నేత సామినేని ఉదయభాను అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుబాబుల్ రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. టన్నుకు రూ.4,400లు ప్రకటించినప్పటికీ రూ.2,200ల నుండి 2,300లు కూడా దక్కని పరిస్థితి ఉందని, సుబాబుల్ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రూ.4400లు మద్దతు ధర కల్పిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసినా అది కాగితాలకే పరిమితమైందన్నారు. సుబాబుల్‌కు గిట్టుబాటు ధర అందించడంలో జిల్లా మంత్రి ఉమ, ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యారని దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని, దిక్కుమాలిన ప్రభుత్వమని ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాడు చేసిన విమర్శలు, ఆందోళనలు అధికారం చిక్కగానే మరచిపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరిగి అధికారంలోకి ఎలా రావాలన్న యావ తప్ప రైతులను, ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచన లేకపోయిందన్నారు. సుబాబుల్ గిట్టుబాటు ధరలపై జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగే ఎఎంసీ చైర్మన్ సభకు వస్తున్న మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిలను నిలదీస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవెలమూడి వెంకట నారాయణ, పట్టణ కన్వీనర్ కత్రోజు శ్రీనివాసాచారి, జిల్లా అధికార ప్రతినిధి చిరుమామిళ్ల అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.