కృష్ణ

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: గ్రామీణ ప్రాంతాలలో భూ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యేకంగా భూముల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ చెప్పారు. నూజివీడు రెవెన్యూ డివిజన్ అధికారిగా పనిచేసిన చెరుకూరి రంగయ్య నుండి సబ్‌కలెక్టర్ దినకర్ బుధవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మహారాష్టక్రు చెందిన దినకర్ ఐఐటీ గౌహతీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. అనంతరం నాలుగు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. సివిల్స్‌లో ఉత్తీర్ణులై 2015లో ఐపీఎస్‌కు ఎంపికై మధ్యప్రదేశ్‌లో పనిచేశారు. 2016లో ఐఎఎస్‌కు ఎంపికై గుంటూరులో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. నూజివీడు సబ్ కలెక్టర్‌గా తొలిసారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానంగా భూ సమస్యలపై దృష్టి సారిస్తానని చెప్పారు. భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, తోటి ఉద్యోగుల సహకారంతో వీటిని వీలైనంత త్వరలో పరిష్కరించి, రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సబ్ కలెక్టర్ దినకర్ పుడ్కర్ మొక్కలు నాటారు.

మోటార్లతో నీళ్లు తోడేస్తే మా పరిస్థితి ఏంటి?

గుడ్లవల్లేరు, నవంబర్ 14: సాగునీరు మోటార్లు వేసి తోడేస్తే మా పరిస్థితి ఏంటని వడ్లమన్నాడు ఎంపీటీసీ బెల్లంకొండ ఏడుకొండలు ఇరిగేషన్ ఎఇ సిద్దార్ధను నిలదీశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం ఎంపీపీ కొసరాజు విజయ భారతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వడ్లమన్నాడు డ్రెయిన్ కింద సాగవుతున్న వరి పొలాలకు సాగునీరు అందక గత 30 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని, నాలుగేసి మోటార్లు ద్వారా డ్రైయిన్‌లో నీరు తోడేస్తున్నారని, దీంతో దిగువ రైతులకు సాగునీరు అందటం లేదని వాపోయారు. ఈ సందర్భంగా ఎఇ సిద్దార్ద మాట్లాడుతూ ఎగువ నుంచి సాగునీరు తక్కువగా రావటం వల్ల అన్ని డ్రెయిన్లకు సరిపడా పంపాల్సి ఉండగా తోడాల్సి వస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారిణి నిమ్మగడ్డ రమాదేవి మాట్లాడుతూ డిసెంబరు 15వ తేదీ లోగా రైతులు వ్యవసాయ పరికరాలు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఎంపీపీ కొసరాజు విజయ భారతి మాట్లాడుతూ మండలంలో పాడి పరిశ్రమను రైతులు అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి పశువుకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.