కృష్ణ

ఆర్సీ భూముల ఆక్రమణకు సీపీఎం యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: మండలంలోని ఐలూరులో కరకట్ట దిగువున రివర్ కన్జర్వెన్సీ(ఆర్సీ) భూముల ఆక్రమణలకు బుధవారం సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో స్థానిక దళితులు ప్రయత్నించారు. ఉదయం 10 గంటలకు జిల్లా సీపీఎం కార్యదర్శి ఆర్ రఘు, మండల సీపీఎం కార్యదర్శి సిహెచ్ సుబ్బారావు, జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శీలం ప్రకాశరావు నేతృత్వంలో దళితులు ఎర్రజెండాలు చేతపట్టి ఆర్‌ఎస్‌నెం 28/1లోని 10 ఎకరాల ఆర్సీ భూముల్లోకి ప్రవేశించారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ జి భద్రు, ఎస్‌ఐ టి మురళీ, ఎఎస్‌ఐ నాంచారయ్య, ఆర్‌ఐ ప్రసాద్, విఆర్‌ఓ వెంకట్రామయ్య సిబ్బంది చేరుకున్నారు. తహశీల్దార్, ఎస్‌ఐని చూసిన దళితులు తమకు భూములు పంపిణీ చేయకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే భూముల్లోకి ప్రవేశిస్తే ఇవి ఆర్సీ భూములు ఎవరు ప్రవేశించవద్దని బోర్డులు పెట్టారని, ఆ తరువాత ఓ రైతు బోర్డులను తొలగించి దొంగతనంగా భూమిని అర్థరాత్రుళ్లు దున్ని పైరు వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి రఘు ప్రశ్నించారు. ఈ భూమిలో కొంత భాగం చక్కా రుక్మిణమ్మ పేరు మీద లీజుకు తీసుకుందని, గతంలో హైకోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని తెలియటంతో ఆర్సీ అధికారుల ద్వారా ఆ బోర్డులను తొలగించారన్నారు. హైకోర్టులో కేసుని ఆర్సీ అధికారులు డీల్ చేయాల్సి ఉందని, కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని భద్రు విజ్ఞిప్తి చేయగా దళితులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. రుక్మిణమ్మ లీజు ఆర్డర్ చూపితే తాము భూముల జోలికి రామని సీపీఎం కార్యదర్శి రఘు అన్నారు. చాలా సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తామేమీ చేయలేమని తహశీల్దార్, ఎస్‌ఐ తిరిగి వచ్చేశారు.

19న చల్లపల్లిలో సీఎం బహిరంగ సభ

చల్లపల్లి, నవంబర్ 14: ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చల్లపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జెడ్పీ హైస్కూల్ వద్ద, ప్రతిపాదిత ఆటోనగర్ స్థలంలో ఏర్పాటు కానున్న సభాస్థలి, హెలీప్యాడ్‌లు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చల్లపల్లిలో జాబ్ మేళా నిర్వహించాలని డీఆర్‌డీఎ అధికారులకు సూచించారు. సభాస్థలి వద్ద వివిధ శాఖలు అమలు చేసే సంక్షేమ పథకాలు విరివిగా ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వికలాంగులకు ఉపకరణాల పంపిణీ స్టాల్స్ అన్ని కార్పొరేషన్‌లు కలిసి పంపిణీ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. హెలీప్యాడ్ వద్ద నుండి బహిరంగ సభకు ముఖ్యమంత్రిని తీసుకువచ్చే దారిపొడవున ప్లాంటేషన్ చేయాలన్నారు. మేలు జాతి పశువులతో ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. హైస్కూల్ వద్ద నుండి వేదిక వరకు కళా బృందాలతో కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఎద్దుల బండిపై నుండి ముఖ్యమంత్రి పరిశీలించడానికి ఎద్దుల బండిని సిద్ధం చేయాలన్నారు. విద్యా శాఖ డిజిటల్ క్లాస్ రూమ్ స్టాల్, వివిధ రకాలైన ఆహార పదార్ధాల స్టాల్స్‌ను ఐసీడీఎస్ ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. జెడ్పీ హైస్కూల్ ఆవరణలో గాంధీ స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అటవీ శాఖ, మడ అడవుల డెమో, మత్స్యశాఖ జల్లీ ఫిష్, టి అనిమోస్ చేపల ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. డ్రెయిన్ సుందరీకరణ పనులు చేయాలన్నారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్‌ఓ లావణ్యవేణి, బందరు ఆర్డీఓ ఉదయ భాస్కర్, నూజివీడు సబ్ కలెక్టర్ దినకర్, జెడ్పీ సీఇఓ షేక్ సలాం, మత్స్యశాఖ జెడీ యాకూబ్ భాషా, ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, జెడ్పీటీసీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

బాలలే భారత భాగ్య విధాతలు

మైలవరం, నవంబర్ 14: నేటి బాలలే భారత భాగ్య విధాతలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వరలక్ష్మి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. బాల్యం గుర్తుకు వస్తే భారమైన వయసు తేలికవుతోందన్నారు. బాల్యంలోని జ్ఞాపకాలు మరో మారు ఆవిష్రృతమవుతాయన్నారు. దేశంలో బాల్యాన్ని బాల్యంగా అనుభవిస్తున్న పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. బార్ కార్యదర్శి విటి కిషోర్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.