కృష్ణ

అష్టకష్టాల్లోనూ అగ్రస్థానంలో ఆంధ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: ఆంద్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలిపిన ఘనత చంద్రబాబుదేనని, ప్రజలు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని అప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం నెరవేరుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నూతన కమిటీ అభినందన సభలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి అతడు సినిమా స్టోరీ చూసి సానుభూతి ప్రయత్నం చేశారని, అది బెడిసికొట్టిందన్నారు. తెలంగాణాలో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని, రానున్న ఎన్నికల్లో మోదీ ప్రధాని కాలేరని, చంద్రబాబుతో వైరం పెట్టుకున్న ఫలితం మోదీ అనుభవించకతప్పదని అన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ పాలిచ్చే చంద్రబాబు కావాలి, తనె్న దున్నపోతు లాంటి జగన్ కావాలా రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. కోడికత్తి డ్రామా అడిన జగన్ అది ఫలింతలేదన్నారు. పోలీసులపై కేసు పెట్టిన ఘనత జగన్మోహనరెడ్డిదేనని తనకు ఆస్తులు లేవంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. జగ్గయ్యపేటపై వరాల జల్లు కురిపిస్తూ నిర్మిస్తున్న గోడౌన్ కాక మరో గోడౌన్ నిర్మాణానికి మంజూరు చేశారు. చంద్రబాబు సాఫ్ట్‌వేర్ అయితే జగన్ హార్డ్‌వేర్ అని, ప్రజలు గుర్తెరిగి చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలన్నారు. సభకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అధ్యక్షత వహించగా సభలో ఎంఎల్‌సీ తొండపు దశరధ జనార్థన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, యార్డ్ చైర్మన్ కట్టా వెంకట నర్శింహరావు, మాజీ చైర్మన్ మల్లెల గాంధీ, జిల్లా తెలుగు మహిళ ఆచంట సునీత తదితరులు ప్రసంగించారు. అనంతరం యార్డ్ నూతన కమిటీని ఘనంగా సత్కరించారు.

మొబైల్ లిఫ్టుల ద్వారా సాగునీరు

*మంత్రి ఉమ వెల్లడి

జి.కొండూరు, నవంబర్ 14: మొబైల్ లిఫ్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గుర్రాజుపాలెంలో మంగళవారం రాత్రి జరిగిన గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 70ఏళ్ళలో ఏర్పాటు కాని విధంగా 22 లిఫ్టులతో 32 చెరువుల కింద 7 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు భారీగా ఇళ్ళపట్టాలను పంపిణీ చేశామని, గ్రామాలు ఎల్‌ఇడి కాంతులతో మెరుస్తున్నాయన్నారు. సాగర్ నీటితో పంటలను రక్షించామని, సిమెంటు రహదారులను నిర్మిస్తున్నామన్నారు. మైలవరం ఏరియా ఆసుపత్రిలో ఈఐ కేంద్రం ద్వారా ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తప్పులు చేసి జైలుకు వెళ్లిన వారు కూడా అదేదో స్వాతంత్య్ర సంగ్రామంలో జైలుశిక్ష అనుభవించి నట్టు ప్రచారం చేసుకుంటున్నారని జైలుపక్షి జగన్‌ను విమర్శించారు. చేసిన తప్పులను కూడా ఒప్పులుగా ప్రచారం చేసుకోవడం వారికే చెల్లిందన్నారు. దొరల్లా దొంగలు గ్రామాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. ఏదో విధంగా ప్రచారం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని మంత్రి ఉమ స్పష్టం చేశారు. ఈడీ కేసుల్లో నిందితులుగా ఉండి డబ్బు సంచులతో ఎన్నికల గోదాలోకి దిగే వారికి ఎలా గుణపాఠం చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. అక్రమ మార్గంలో కోట్లు కొల్లగొట్టిన వారు కూడా నీతి మంతుల్లా ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు, పార్టీ నాయకులు పటాపంచల నరసింహారావు, వరికూటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.