కృష్ణ

వర్సిటీల్లో పాఠాలుగా జగన్ అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రపంచంలోని వివిధ వర్సిటీల్లో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపైనా, గతంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను ఎలా భ్రష్టు పట్టించారన్న అంశంపైనా పాఠాలు చెబుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ ఇది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానమే జగన్, విజయసాయి రెడ్డిలను ఆర్థిక ఉగ్రవాదులుగా పేర్కొన్న విషయాన్ని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ గుర్తు చేసుకోవాలని హితవుపలికారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా బుగ్గన శైలి ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుని ప్రతి శుక్రవారం కోర్టు చుట్టూ తిరుగుతోంది జగన్ అంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యలపై పోరాడటం మాని రోడ్లు పట్టుకు తిరుగుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. బుగ్గన రాజకీయ ప్రస్థానం కూడా టీడీపీ నుంచే ప్రారంభమైందని మరచినట్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసుల నుంచి బయట పడేందుకు బీజేపీ ప్రభుత్వం ముందు సాగిల పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తుంటే రక్షించుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.
పరిశ్రమ ఏర్పాటులో అలసత్వాన్ని ఉపేక్షించవద్దు
భూమిని తీసుకుని పరిశ్రమ ఏర్పాటులో అలసత్వం వహిస్తే, ఉపేక్షించవద్దని ఏపీఐఐసి అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన భూమి, వాటి వినియోగంపై బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన భూమిని ఏపీఐఐసి ఎంత మేరకు వినియోగించిందన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో వేల ఎకరాలు తీసుకుని, ఆ భొమిపై బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటివి జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ ఏపీఐఐసికి 41,838 ఎకరాలను కేటాయించినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. మరో 19 వేల ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. భూమి తీసుకుని నిర్ణీత సమయంలో పరిశ్రమలు నెలకొల్పకపోతే, జరిమానా విధిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి ప్రారంభించాకే సేల్‌డీడ్ ఇస్తున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంఎస్‌ఎంఇ పార్క్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మొదటి దశలో 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఏపీఐఐసి ఎండీ ఎ.బాబు, తదితరులు పాల్గొన్నారు.