కృష్ణ

హెచ్‌ఆర్డీ భవన నిర్మాణాలకు పాలనామోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): అమరావతిలో ఏపీ హెచ్‌ఆర్డీ ఇనిస్టిట్యూట్ భవన నిర్మాణాలకు సంబంధించి పరిపాలనా ఆమోదం లభించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి (ఏపీ హెచ్‌ఆర్‌డీ) సంస్థకు అమరావతిలో భవన నిర్మాణం, దానికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎస్ పునేఠా బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్, ఇతర విభాగాల అధికారులతో సమావేశమైన ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా అమరావతిలో హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ భవన నిర్మాణాలకు సంబంధించిన పరిపాలనామోదం, సొసైటీల చట్టం కింద ఏపీ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ పేరును ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌గా రిజిష్టర్ చేసే అంశంపైన ఈ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్షించారు. వీటితో పాటు విశాఖపట్నంలో ఏర్పాటు చేయ ప్రతిపాదించిన ఏపీ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఏపీ హెచ్‌ఆర్‌డీ కిందకు తీసుకువచ్చే విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పునేఠా మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీ రెవెన్యూ అండ్ సర్వే అకాడమీను ఏర్పాటు చేస్తున్నామని, దానిని కూడా హెచ్‌ఆర్‌డీ పరిధిలో పని చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వీటి కోసం ఏర్పాటు చేసే వౌలిక సదుపాయాలను రెండు సంస్థలు ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెవెన్యూ ఉద్యోగులకు సరైన శిక్షణా కేంద్రం లేదని, రెవెన్యూ అండ్ సర్వే అకాడమీతో ఆ సమస్య తీరుతుందని తెలిపారు. ఏపీ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ డి చక్రపాణి మాట్లాడుతూ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అమరావతిలో 25 ఎకరాలు స్థలం కేటాయించడంతో పాటు ప్రాథమికంగా రూ. 10 కోట్లు నిధులను కూడా ప్రభుత్వం కేటాయించదన్నారు. తాత్కాలికంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ, ఇతర వసతికి ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్లాకు అనువుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం దానిని విశ్వవిద్యాలయం పూర్తిగా వినియోగించుకోనందున ఆ బ్లాకును ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దానిపై సీఎస్ పునేఠా వెంటనే స్పందించి ఆ బ్లాకును తాత్కాలిక ప్రాతిపదికన హెచ్‌ఆర్‌డీకి ఇచ్చేందుకు చర్యలు ఉన్నత విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎపీ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు రూ. 250 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం తరుపున కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. వీటితో పాటు ఈ సమావేశంలో ఏపీ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈసమావేశంలో పంచాయితీరాజ్ కన్సల్టెంట్ కొండలరావు, పంచాయితీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ్ధర్, అదనపు కమిషనర్ రంగారావు, సీసీఎల్‌ఏ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.