కృష్ణ

వారం రోజుల్లో ‘ముడ’కు రూ.1350 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మరో వారం రోజుల్లో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ)కు రూ.1350 కోట్లు బ్యాంక్ రుణంగా మంజూరు కానుందని ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు. తన ఛాంబర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బందరు ఓడరేవు నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో ఉన్నారన్నారు. ఇటీవల ఖనిజాభివృద్ధి సంస్థ నుండి రుణంగా తీసుకున్న రూ.200కోట్లతో భూముల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించామన్నారు. నాలుగు రోజుల్లో వంద ఎకరాల భూమిని రైతులు స్వచ్చందంగా ముడకు రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ఎకరానికి రూ.25 లక్షలు చొప్పున భూములు ఇచ్చిన రైతులకు రూ.23కోట్ల 83లక్షల 87వేల 500లు పరిహారంగా అందచేసినట్లు చెప్పారు. రూ.200కోట్లను మార్జిన్ మనీగా చూపించి ప్రభుత్వ గ్యారంటీతో వివిధ వాణిజ్య బ్యాంక్‌ల నుండి రూ.1350లు రుణం పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. వారం రోజుల్లోనే బ్యాంక్ రుణం మంజూరు కానున్నట్లు తెలిపారు. ముడకు భూమి ఇచ్చిన వెంటనే సంబంధిత రైతుకు పరిహారం మొత్తం అందచేస్తున్నామన్నారు. బ్యాంక్ రుణంతో పాటు ఫైనాన్స్ డిపార్టుమెంట్ నుండి మరో రూ.140 కోట్లు త్వరలోనే ముడకు రానున్నట్లు చెప్పారు. డిసెంబర్ మాసాంతానికి పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పోర్టు నిర్మాణానికి రెండు విడతలు శంకుస్థాపన చేశారన్నారు. మళ్లీ శంకుస్థాపన చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. నేరుగా పోర్టు పనులను ప్రారంభించి సీఎం చంద్రబాబును ఈ ప్రాంతానికి తీసుకు వస్తామన్నారు. ఎవరైనా పెట్టుబడిదారులు ముందుకు వచ్చి పరిశ్రమల స్థాపనకు స్థలం కోరితే అవసరం మేర వారికి భూములను ఇస్తామన్నారు. సమావేశంలో ముడ వైస్ చైర్మన్ పి విల్సన్‌బాబు పాల్గొన్నారు.

సజావుగా భూముల కొనుగోళ్లు

*ముడ వీసీ విల్సన్‌బాబు

మచిలీపట్నం, నవంబర్ 15: పోర్టు భూముల కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) వైస్ చైర్మన్ విల్సన్‌బాబు అన్నారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనసాగుతున్న భూముల కొనుగోళ్ల ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ ప్రసాదరావు ప్రత్యేక చొరవతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉదయం నుండి రాత్రి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు 30 మంది రైతుల నుండి 95 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. భూములు ఇచ్చే రైతులపై ఎటువంటి పన్నుల భారం పడదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. క్యాపిటల్ గన్స్ విషయంలో కూడా నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని వీసీ విల్సన్ బాబు తెలిపారు.