కృష్ణ

మళ్లీ సీఎం పర్యటన వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : అనుకున్నంతా అయంది... ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దివిసీమ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీన ఉల్లిపాలెం-్భవానీపురం వారధి ప్రారంభోత్సవంతో పాటు కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో జరిగే గ్రామదర్శిని, చల్లపల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు హాజరు పాల్గొనాల్సి ఉంది. బాబు తమ ప్రాంతానికి వస్తే తమ బతుకులు బాగుపడతాయని దివి ప్రాంత ప్రజలు భావించారు. తొలుత చంద్రబాబు పర్యటన కుదించినట్టు వార్తలు వచ్చాయ. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మళ్లీ ఈ నెల 21వ తేదీన సీఎం దివిసీమ పర్యటనకు వస్తారని ఆయన తెలిపారు.

ఫసల్ బీమా యోజనపై అవగాహన కల్పించాలి
* పంట నష్టాల నుండి రైతులకు రక్షణ
* కలెక్టర్ బి లక్ష్మీకాంతం
విజయవాడ(సిటీ), నవంబర్ 16: పంట నష్టాల నుండి రైతులకు రక్షణగా నిలిచే ఫసల్ బీమా యోజనపై రైతులకు పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం పేర్కొన్నారు. రైతులకు తాము పండించే పంటలకు అనుకోని సమయంలో వచ్చే పంట నష్టాల నుండి రక్షణగా ఉంటుందన్నారు. ఈ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై అవగాహన కల్పించే వాహనాలను శుక్రవారం కలెక్టర్ బి లక్ష్మీకాంతం జెండా ఉపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ 2018 -19 సంవత్సరానికి సంబంధించి సాగు చేసే పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఈపథకం ద్వారా రైతులు కట్టాల్సిన ప్రీమియం తక్కువగా ఉండి ఆర్థికంగా వెసులు బాటు ఉంటుందన్నారు. బీమా మొత్తం విషయంలో రైతులకు పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. పథకంలో భాగంగా అగ్ని ప్రమాదం, పిడుగు పాటు, తుపాను, వరదలు నీటి ముంపు, భూమి కోతకు గురి కావడం, పంటకు తెగుళ్లు, కీటకాల నుండి నష్టం, ప్రకృతి వైపరీత్యాలు ద్వారా దిగుబడి నష్టాలకు బీమా రక్షణ లభిస్తుందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి, రుణాలు పొందిన రైతులకు బ్యాంకులు తప్పని సరిగా రుణాల నుండి ప్రీమియం మినహాయించి బీమా కంపెనీలకు జమచేస్తామన్నారు. ఈ పథకంలో వరిపైరుకు గ్రామాన్ని యూనిట్ గాను, ఇతర పంటలకు మండలాన్ని యూనిట్‌గాను పరిగణిస్తారన్నారు. బీమాలో చేరేందుకు వరి పంటకు జనవరి 15 2019, మొక్కజొన్నకు ఈ ఏడాది డిసెంబర్ 31, మినుము పెసరకు ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు చివరి తేదీలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పథకంలో రుణం తీసుకోని రైతులు దరఖాస్తుతో పాటు ఆధార్, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు, మండల వ్యవసాయాధికారి, విఆర్‌ఓ నుండి విత్తనం వేసినట్లుగా ధృవీకరణ పత్రం, కౌలు రైతు అయితే ఎగ్రిమెంట్ సర్ట్ఫికెట్, బుణ అర్హత గుర్తింపు కార్డు తీసుకుని బీమాలో చేరి పంట రక్షణ పొందాలన్నారు. వరి పంటకు ఎకరాకు 36 వేలు బీమా చేస్తే 1.5 శాతంలో భాగంగా రూ. 500 ప్రీమియం రైతులు చెల్లించాలన్నారు. మొక్కజొన్న పంటకు ఎకరాకు 35 వేలకు రూ. 525 ప్రీమియం, పెసర్ పంట బీమా మొత్తం రూ. 12 వేలకు రూ. 180 ప్రీమియం, మినుమ పంటకు రూ. 16500కు రూ. 247.50 ప్రీమియం రైతులు చెల్లించాలన్నారు. రైతుల పంటకు పూర్తి రక్షణ కల్పిస్తున్న ఈ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ టి మోహనరావు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, ఎడిఎ సునీల్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.