కృష్ణ

అంతర్ జిల్లా హాకీ టోర్నీలో ‘కృష్ణా’కు ద్వితీయ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ జూనియర్ (బాలుర) అంతర్ జిల్లాల హాకీ ఛాంపియన్ షిప్ పోటీల్లో కృష్ణాజిల్లా హాకీ జట్టు క్రీడాకారులు అత్యద్భుతమైన ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానంలో నిలిచారు. గ్రూప్ బి లీగ్ మ్యాచ్‌లలో మొదటి మ్యాచ్ నెల్లూరు జట్టుపై 0-6 తేడాతో, రెండవ మ్యాచ్ కర్నూలు జట్టుపై 0-16 తేడాతో జిల్లా జట్టు విజేతగా నిలవగా మూడవ మ్యాచ్ విశాఖపట్నం జట్టుతో 1-1 డ్రాగా ముగిసింది. లీగ్ దశలో గ్రూప్ బి నుండి అగ్రస్థానంలో నిలిచి సెమీ పైనల్‌లో పశ్చిమ గోదావరి జట్టుతో 0-3 తేడాతో గెలుపొంది పైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ కడప జట్టుతో విరోచితంగా పోరాడి 3-2 తేడాతో ద్వితీయ స్థానంలో నిలిచింది. అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన జట్టు సభ్యులు రాఘవేంద్రరావు, జి ప్రమోద్, వి సాయి, జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన జి రాజశేఖర్, మేనేజర్ ఎస్‌కె హబీబ్ బాషాలను జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రవణం రామకృష్ణ అభినందించారు.

ఆలయ ఆస్తులను పరిరక్షించాలి

ముదినేపల్లి, నవంబర్ 16: ఆలయ ఆస్తులను పరిరక్షించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ దేవాదాయశాఖ డెప్యూటీ కమిషనర్ పివిఎస్ దుర్గాప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని శింగరాయిపాలెం-చేవూరిపాలెంలోని శ్రీ వల్లీదేవ సేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని శుక్రవారం సందర్శించి పూజలు నిర్వహించి స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బాబాజీ మఠంలో నిర్మితమవుతున్న నూతన ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. దేవస్థానం ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట వద్ద షెడ్డు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మండల పరిధిలోని కోడూరు గ్రామంలోని శ్రీ జనార్దనాలయం, శ్రీ రామాలయంను ఆయన పరిశీలించారు. ఆయన వెంట గుడివాడ దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ పి సురేష్‌బాబు, కార్యనిర్వహణాధికారి విపి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.