కృష్ణ

పెడన చైర్మన్ ‘బండారు’పై అట్రాసిటీ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, : వైసీపీకి చెందిన పెడన మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పట్టణంలో పందులను అరికట్టేందుకు ఆయన తీసుకున్న చర్య కేసు నమోదుకు దారితీసింది. ఈ ఘటన టీడీపీ, వైసీపీ మధ్య పోరుగా మారి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నాయకుల ప్రోద్భలం వల్లే తన మీద అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆనందప్రసాద్ ఆరోపించారు. ఐపీసీ సెక్షన్ 506, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ 3 క్లాజ్ (1) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లుగా బందరు రూరల్ సీఐ రవికుమార్ శుక్రవారం తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో పందులను అరికట్టేందుకు చైర్మన్ ఆనందప్రసాద్‌తో పాటు మున్సిపల్ అధికారులు చర్య లు తీసుకున్న ప్రయత్నంలో ఆ వర్గాలకు చెందిన పందుల యజమానులకు అవగాహన కల్పించారు. అయితే ఈ సందర్భంగా మాటా మాటా పెరిగి చైర్మన్ తమను కులం పేరుతో దూషించారని 18వ వార్డు టీడీపీ కౌన్సిలర్ శానాపతి పెదభిక్షం స్థానిక పోలీసు స్టేషన్‌లో నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన బందరు రూరల్ సీఐ కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోద్భలం వల్లే తనపై అక్రమ కేసు బనాయంచారని చైర్మన్ ఆనందప్రసాద్ శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆరోపించారు. గతంలో వారు చేసిన అక్రమాలను నిలదీసినందుకే తనపై కక్ష కట్టారన్నారు. తాను అధికారం చేపట్టిన నాటి నుండి అనేక విధాలుగా తనను రాజకీయంగా వేధిస్తున్నారన్నారు. టీడీపీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ లంకే స్రవంతి సహకారం వల్ల తాను చైర్మన్ అయిన మాట వాస్తవమేనని, అప్పటి నుంచి కూడా ఆమెను పదవికి అనర్హురాలిని చేయాలని టీడీపీ నాయకులు పలు విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యారని, ఇందులో భాగంగానే ఇటీవల కోర్టు కూడా స్రవంతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఫలితంగా టీడీపీ నాయకులు తనపై అవకాశం దొరికింద కదా అని అక్రమ కేసు బనాయించారని ఆవేదన చెందారు. తాను కేసులకు భయపడేది లేదని, పందుల నిర్మూలనకే తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ సమావేశంలో 1వ వార్డు కౌన్సిలర్ పిచ్చుక జగదీష్ పాల్గొన్నారు.