కృష్ణ

వణికిస్తున్న ‘గజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గజ’ తుఫాన్ జిల్లా రైతాంగాన్ని వణికిస్తోంది. తుఫాన్ హెచ్చరికలతో గత రెండు రోజులుగా ఆందోళనకు గురైన రైతాంగం శుక్రవారం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు మరింత ఆందోళనకు గురవుతున్నారు. సముద్ర తీర ప్రాంతమైన మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరో వారం పది రోజుల్లో పంటలు కోతకు రానున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాన్ రైతుల పాలిట శాపంగా మారింది. గజ తుఫాన్ వల్ల జిల్లాపై ప్రభావం చూపే అవకాశం లేకపోయినా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు రైతాంగాన్ని ఠారెత్తిస్తున్నాయి. కొద్దిపాటి వర్షం కురిసినా నిడివి మీద ఉన్న పంట నేలకొరిగి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక కష్ట నష్టాలకోర్చి ఖరీఫ్ సాగు చేసి పంట చేతికి వచ్చే సమయంలో మాయదారి తుఫాన్‌ను రైతులకు ముచ్చచెమటలు పట్టిస్తోంది. సకాలంలో సాగునీరు అందక, సరైన సమయంలో వర్షాలు పడక ఖరీప్ పంటను సాగు చేసేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వచ్చిన కొద్దిపాటి సాగునీటినే వినియోగించుకుని అదనంగా బోర్ల ద్వారా సాగు చేశారు. దిగుబడులు కూడా ఆశాజనకంగా వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గజ తుఫాన్ రైతులను కలవరపరుస్తోంది.