కృష్ణ

21న ఉల్లిపాలెంలో సీఎం గ్రామదర్శిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు: ఈ నెల 21వతేదీన మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో నిర్వహించనున్న గ్రామదర్శిని కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం వారు పరిశీలించారు. ఉదయం 9.30ని.లకు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలిఫ్యాక్టర్‌లో ఉల్లిపాలెం చేరుకుంటారన్నారు. ఉల్లిపాలెం-్భవానీపురం వారధి ప్రారంభోత్సవంతో పాటు వారధి సమీపంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల తెలుగు తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారన్నారు. దేశంలోనే అతి పెద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని శనివారం వారధి వద్ద నెలకొల్పారు. తెలుగు తల్లి విగ్రహావిష్కరణ దివిసీమ ఉప్పెనకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం సందర్శిస్తారని తెలిపారు. అలాగే కృష్ణానదిలో ఎన్‌డీఆర్‌ఎఫ్ నిర్వహించే మాక్ డ్రిల్, మత్స్య శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న కలర్‌ఫుల్ బోట్ షోను సీఎం వీక్షించనున్నట్లు చెప్పారు. అనంతరం ఉల్లిపాలెం గ్రామం చేరుకుని తుఫాన్ షెల్టర్‌ను పరిశీలించి మొక్కలు నాటుతారన్నారు. పక్కా గృహాలను పరిశీలిస్తారన్నారు. ఉల్లిపాలెం ఎక్స్‌ప్రెస్ వాల్ పెయింటింగ్‌ను సీఎం ప్రారంభిస్తారన్నారు. తదుపరి మినీ గోకులంను సీఎం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రజలతో మాట్లాడతారన్నారు. ఈ కార్యక్రమంలో జెసీ-2 పిడుగు బాబూరావు, ఆర్డీవోలు జె ఉదయ భాస్కర్, సత్యవేణి, జెడ్పీ సీఇఓ షేక్ సలాం, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, డీఎస్‌ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో గవర్నర్ పాలనకు జగన్ కుట్ర

గుడివాడ, నవంబర్ 17: రాష్ట్రంలో గవర్నర్ పాలన రావాలని ప్రతిపక్ష నేత జగన్ చూస్తున్నారని రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామంలో రూ.1.40కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, రూ.6.5లక్షలతో నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమానికి మంత్రి కొల్లు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నారని, ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని అన్నారు. 16నెలల పాటు జైలు జీవితం గడిపి వచ్చిన జగన్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారన్నారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసి కోడి కత్తి డ్రామాను రక్తి కట్టించారన్నారు. ప్రధాని మోదీ, రాష్టప్రతి కోవింద్‌ను పదేపదే కలిసి రాష్ట్రంలో గవర్నర్ పాలన తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని తుపాను బాధితులను ఇప్పటి వరకు పరామర్శించేందుకు వెళ్ళకపోవడం దారుణమన్నారు. పవన్‌కళ్యాణ్ గతంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేసి మన రాష్ట్రానికి కేంద్రం రూ.75వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం గ్రామంలో పర్యటించి టీడీపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా చంటి తదితరులు పాల్గొన్నారు.