కృష్ణ

సీఎం బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి: మండల కేంద్రం చల్లపల్లిలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం, దివిసీమలను అనుసంధానం చేయనున్న ఉల్లిపాలెం-్భవానీపురం వారధి ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం స్వీయ పర్యవేక్షణలో సీఎం బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్దేశిత ఆటోనగర్ స్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఉపసభాపతి బుద్ధప్రసాద్, కలెక్టర్ లక్ష్మీకాంతం పరిశీలించారు. రెయిన్ ఫ్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వేదిక, డి సర్కిల్ ఏర్పాట్లు, ప్రెస్ ఎన్‌క్లొజర్స్ వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. డి సర్కిల్‌లో అందమైన రంగోలి ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ సభను ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరం మేర ఎల్‌ఇడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభ వద్ద వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, వైద్య, డీఆర్‌డీఎ తదితర శాఖల ద్వారా స్టాల్స్, ప్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్‌డీఎ ద్వారా జాబ్‌మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మంచినీటి వసతి కల్పించాలన్నారు. సీఎంకు స్వాగతం పలికేందుకు వివిధ కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలన్నారు. తొలుత సీఎం చంద్రబాబు గాంధి స్మృతివనంను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఆటోనగర్‌కు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, జెడ్పీటీసీ పైడిపాముల కృష్ణకుమారి, జెసీ-2 పిడుగు బాబూరావు, ఆర్డీవోలు జె ఉదయ భాస్కర్, సత్యవేణి, జెడ్పీ సీఇఓ షేక్ సలాం, వ్యవసాయ శాఖ జెడీ మోహనరావు, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, డీఎస్‌ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓగా ‘బాబూరావు’
మచిలీపట్నం, నవంబర్ 17: జిల్లా ఇన్‌ఛార్జ్ రెవెన్యూ అధికారిగా జాయింట్ కలెక్టర్-2 పిడుగు బాబూరావు నియమితులయ్యారు. ఇటీవల ఐఎఎస్ అధికారిగా కన్ఫర్మేషన్ అయిన జిల్లా రెవెన్యూ అధికారి బి లావణ్య వేణిని ఎన్నికల విధుల నిమిత్తం రాజస్థాన్‌కు డిప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో జాయింట్ కలెక్టర్-2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పిడుగు బాబూరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.