కృష్ణ

బీసీలకు అండదండ ‘తెలుగుదేశమే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని శాసనమండలి సభ్యుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. జయహో బీసీ నినాదంతో ఈ నెల 31వతేదీన రాజమండ్రిలో నిర్వహించనున్న బహిరంగ స భను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2లక్షల మ ంది బీసీలతో జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల నుండి బీసీలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు హాజరై విజయవ ంతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అవిర్భావం నుండి నేటి వరకు బీసీలకు అన్ని విధాలుగా అండగా నిలిచినట్లు తెలిపారు. నేడు బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందారంటే అది ఒక్క తెలుగుదే శం పార్టీ వల్లేనన్నారు. ఏ వర్గానికి ఇవ్వని ప్రాధాన్యత బీసీల కు ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా బీ సీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. నాడు ఆదరణ పథకం కింద చేతి వృత్తిదారులను ఆదుకోగా మళ్లీ ఆదరణ-2 కింద నేడు చేతి వృత్తిదారులకు బాసటగా నిలిచినట్లు చెప్పారు. ఆదరణ-2 కింద 8 లక్షల మంది చేతివృత్తిదారులకు రూ.4వేల కోట్లతో పని ముట్లు అందచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పని ముట్లు ఇవ్వడమే కాకుండా వృత్తి నైపుణ్యం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్సీ అర్జునుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ రమేష్ నాయుడు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పివి ఫణికుమార్ పాల్గొన్నారు.