కృష్ణ

దుర్గమ్మ సేవలో హైకోర్టు జస్టిస్, చీఫ్ సెక్రటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మను ఆదివారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా ఆశీర్వాద మండపంలో అర్చకులు జస్టీస్‌కు దివ్య ఆశీస్సులను అందచేయగా సహాయ ఈవోసాయిబాబా అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. ఇదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠా అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అర్చకులు దివ్య ఆశీస్సులను అందచేయగా, సహాయ ఈవో సాయిబాబా అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా వీరికి ఈవో కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన రవి, సూర్య యంత్ర దీపార్చనలో సతీష్ చంద్ర దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించుకుని స్వయంగా దీపాలు వెలిగించారు. ఈకార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.

దసరా బిల్లులకు ఆమోదం
* గత ఏడాది కంటే తక్కువ ఖర్చుతో నిర్వహణ
* ఈవో కోటేశ్వరమ్మ
ఇంద్రకీలాద్రి, నవంబర్ 18: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో 2018 దసరాకు సుమారు రూ.5కోట్ల, 35లక్షల మేరకు వచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపినట్లు దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్సవాలు ప్రారంభంలో చెప్పినట్లు 2018 దసరా మహోత్సవాల సందర్భంగా వివిధ శాఖలకు చెల్లించిన బిల్లులు, ఖర్చుల నిమిత్తం ఇప్పటి వరకు 5కోట్ల, 35లక్షల మాత్రమే ఇవ్వటం జరిగిందన్నారు. మిగత శాఖలు, ఖర్చులు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లిస్తే ఈఏడాది ఎన్నికోట్లు ఖర్చు చేసిందో స్పష్టమవుతుందన్నారు. ఇప్పటి వరకు చెల్లించిన 5కోట్ల 35లక్షలు పూర్తిస్థాయిలో వివిధ విభాగాల నుండి లెక్కలు తెప్పించి వాటిని పూర్తిస్థాయిలో అడిట్ చేయించినట్లు ఈవో ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. గత ఏడాది 2017 దసరా మహోత్సవాలకు మొత్తం రూ.13కోట్లకు మించి బడ్జెట్ అయినట్లు అడిట్ లెక్కలు చెబుతున్నట్లు వివరించారు. ఈసంవత్సరం దసరా బడ్జెట్ ముందు చెప్పినట్లు సుమారు రూ.8కోట్ల, 50లక్షలు మాత్రమే అవుతోందని మిగతా 2కోట్లకు బిల్లులు వస్తే ముందు చెప్పినట్లు సుమారు 8కోట్ల, 50లక్షలలోపే పూర్తవుతోందని ఈవో తెలిపారు. దసరా బడ్జెట్‌ను తగ్గించేందుకు భక్తులు, దాతలను భాగస్వాములుగా చేర్చటంలో ఈవో చాలావరకు విజయం సాధించారు. దీంతో నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతలు, భక్తులు, సేవ సంస్థలు ముందుకొచ్చి బియ్యం, కందిపప్పు, నూనె, ఇతర సరుకులు ఉచితంగా అందచేశారు. దీంతో నిత్యాన్నదానానికి ఖర్చు తగ్గింది. ఇదేవిధంగా దసరామహోత్సవాల్లో సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే వేదికను సుమారు 10వేల బడ్జెట్‌ను నిర్మించటంతోపాటు కళాకారులకు పారితోషకం తొలగించి కేవలం ఒక మెమోంట్‌ను మాత్రమే అందించటంతో ఈసెక్షన్‌లో పూర్తిస్థాయిలో ఖర్చు తగ్గిపోయింది. ఆలయానికి పూల అలంకారణపై దృష్టి పెట్టి స్వల్పఖర్చుతోనే టెండర్‌దారుని ద్వారా గతంలో వేసిన డిజైన్ ప్రకారమే ఈసంవత్సరం కూడా అలంకారణ చేయించటంతో ఈసెక్షన్‌లోనూ ఖర్చు తగ్గిపోయింది. కుంకుమార్చన పూజల్లో పాల్గొన్న ప్రత్యేక ఉభయదాతలకు దేవస్థానం ఆధ్వర్యంలో చీరలు, జాకెట్‌లు అందచేయటంతో ఈసెక్షన్‌లో సైతం బడ్జెట్ పూర్తిగా తగ్గిపోయింది. దాతలను ఒప్పించి పెద్ద షెడ్‌లను వేయించటంతో ప్రతి సంవత్సరం టెంట్ హౌస్‌లకు చెల్లించే లక్షలాది రూపాయలు ఈఏడాది దేవస్థానానికి ఆదాయంగా మిగిలిపోయింది. ఈవో వీ కోటేశ్వరమ్మ ఖర్చు విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తూ సాధ్యమైన వరకు దేవస్థానానికి ఖర్చు తగ్గించటంతో ఈవో ముందుగానే ప్రకటించిన విధంగా ఖర్చు తగ్గిపోయింది. దేవస్థానంలో పనిచేసే ఈవో నుంచి అటెండర్ వరకు ఇదేవిధంగా ఆలోచన చేస్తే దేవస్థానానికి మరింత ఆదాయంగా పెరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈసమావేశంలో సహాయ ఈవో సాయిబాబా, పర్యవేక్షణాధికారులు విజయ్‌కుమార్, ఎన్ రమేష్, అడిట్ అధికారి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.