కృష్ణ

సమయ పాలనపై శ్రద్ధ వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, :వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమయ పాలన పాటించి, ప్రజా సేవలో ముందుండాలని నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. అధికారులు సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డివిజన్ స్థాయి అధికారుల సమావేశం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతోసమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు అధికారులు ఆలస్యంగా వచ్చారు. దీనిపై సబ్ కలెక్టర్ దినకర్ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సమయపాలన పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. సమావేశానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశించారు. మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పారిశుద్ద్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, సర్పంచ్ పాలన ముగిసిన తరువాత ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది కదా..? ఎందుకు ఈ విధంగా ఉందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ప్రత్యేక చర్యలు తీసుకుని పారిశుధ్య్దాన్ని మెరుగుపర్చాలని సూచించారు. అధికారులు సమన్యయంతో పనిచేసి డివిజన్‌లో జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను సాధించే విధంగా పనిచేయాలని చెప్పారు. పోలీసు, ఎక్సైజ్, రెవిన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి, విస్సన్నపేట, తిరువూరు, ఎ కొండూరు తదితర ప్రాంతాలలో బెల్టుషాపులు లేకుండా చేయాలని సూచించారు. హనుమాన్ జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలని అన్నారు. డివిజన్‌లో చేపట్టిన 32 వేల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా జరిగే విధంగా రెవిన్యూ యంత్రాంగం పనిచేయాలని సూచించారు. డివిజన్ పరిధిలో పేదలకు ఇచ్చే గృహాల పనులు వేగవంతం చేయాలని, పారిశుద్ధ్య లోపం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ దినకర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కార్యాలయం పరిపాలన అధికారి డి వనజాక్షితో పాటు డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.