కృష్ణ

మనసు పెట్టి పని చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివిసీమ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి అధికారి మనసు పెట్టి పని చేయాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. ఈ నెల 21వతేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివిసీమ పర్యటనకు రానున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో సీఎం దివిసీమ పర్యటనపై కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఏర్పాట్లలో ఏ చిన్న లోపం కనిపించినా సహించేది లేదన్నారు. జిల్లా అధికారులంతా ఈ నెల 21వతేదీ సాయంత్రం వరకు జిల్లా కేంద్రం మచిలీపట్నంలో అందుబాటులో ఉండాలన్నారు. క్యాంప్‌లంటూ విజయవాడ వెళితే సహించేది లేదన్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి సీఎం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 9గంటలకు కోడూరు మండలం ఉల్లిపాలెం-్భవానీపురం వారధికి చేరుకుంటారన్నారు. వారధి ప్రారంభోత్సవం, 30 అడుగుల తెలుగు తల్లి విగ్రహావిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా ఉల్లిపాలెం గ్రామ పంచాయతీకి వచ్చి మొక్కలు నాటుతారన్నారు. అక్కడి నుండి గ్రామంలో కాలిబాట పర్యటిస్తారన్నారు. రచ్చబండ ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. అక్కడి నుండి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 1గంటలకు చల్లపల్లి చేరుకుంటారన్నారు. చల్లపల్లిలో గాంధి స్మృతి వనం ప్రారంభోత్సవంతో పాటు ఆటోనగర్‌ను ప్రారంభిస్తారన్నారు. అనంతరం బహిరంగ సభ ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. చేయూత కింద దివ్యాంగులకు పూర్తి స్థాయిలో ఉపకరణాలు పంపిణీ చేసినందుకు, అనీమియా నియంత్రణ చేసినందుకు, సాలీడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసినందుకు రాష్ట్రంలోనే తొలి జిల్లాగా కృష్ణాజిల్లాను సీఎం బహిరంగ సభలో ప్రకటిస్తారని తెలిపారు. అలాగే 1954 కంటే ముందు ప్రభుత్వ అసైన్డ్ చేసిన భూములను 22ఎ నిషేధిత జాబితా నుండి తొలగింపుకు సంబంధించిన జీవోను సీఎం విడుదల చేస్తారన్నారు. ఈ జీవో వల్ల ఒక్క బందరు డివిజన్‌లోనే 18వేల ఎకరాలు నిషేధిత జాబితా నుండి తొలగించడం జరిగిందన్నారు. అలాగే దివిసీమ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏటిమొగ-ఎదురుమొండి మధ్య వంతెన నిర్మాణానికి రూ.77కోట్ల నిధులను సీఎం విడుదల చేస్తారన్నారు. ఈ నెల 20వతేదీ నుండి జిల్లాలో శాశ్వత భూదార్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. డిసెంబర్ 31వతేదీ నాటికి విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి పనులు పూర్తి చేసి జనవరి మొదటి వారం ప్రారంభించడం జరుగుతుందన్నారు. అలాగే బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ జనవరి నెలాఖరు నాటికి, కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను మార్చి నాటికి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్, డీఆర్‌ఓ పిడుగు బాబూరావు, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, డెప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ ఖాజా వలీ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు అసౌకర్యం కలగనివ్వకండి
* 23న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు
* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొల్లు

మచిలీపట్నం : కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈ నెల 23వతేదీన కార్తీక పౌర్ణమి కావటంతో ఆ రోజు జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి సుమారు లక్ష మంది పైబడి భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం మంగినపూడి బీచ్‌ను సందర్శించిన మంత్రి రవీంద్ర అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. తొలుత ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి రవీంద్ర సముద్ర స్నానాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెల్లవారు జామున 4.30ని.లకు సాగర జ్యోతితో ప్రారంభమయ్యే కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు సాయంత్రం 6గంటలకు సముద్ర హారతితో ముగియనున్నట్లు తెలిపారు. మహిళా భక్తులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక డ్రస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ఏపీఎస్ ఆర్‌టీసీ బీచ్ వరకు నేరుగా ప్రత్యేక సర్వీసులు నడపాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలను పర్యవేక్షించాలన్నారు. ఆర్‌డబ్ల్యుయస్, పురపాలక సంఘ అధికారులు సమన్వయంతో భక్తులకు మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఆహ్లాదకర వాతావరణంతో పాటు భక్తి భావం పెంపొందించేందుకు అవసరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లను నిర్వహించాలన్నారు. సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సముద్రంలో ఉన్న లోతులను ముందుగా గుర్తించి హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. మంత్రి రవీంద్ర వెంట టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గొర్రిపాటి గోపిచంద్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, బందరు డీఎస్పీ యండీ మహ్మద్ బాషా, ఎంపీడీవో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ కె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.