కృష్ణ

మోదీ పాలనలో దుర్భర జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు ఎంఎ గఫూర్ అన్నారు. గురువారం స్థానిక జ్యోతిరావ్ పూలే విజ్ఞాన కేంద్రంలో లౌకికతత్వం - రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గఫూర్ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. బాబ్రీ మసీదును కూల్చి నేటికి 26 సంవత్సరాలు పూర్తయిందన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే ఆ రోజు ఎల్‌కె అద్వాని రథయాత్రలు చేసి మతాల మధ్య చిచ్చు పెట్టే వారని గుర్తు చేశారు. ప్రజలకు సుస్థిరమైన పరిపాలన అందిస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశారని, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రగల్బాలు పలికారన్నారు. స్విస్ బ్యాంక్‌లో ఉన్న నిధులను వెనక్కి తీసుకు వచ్చి పేదల ఎకౌంట్లలో రూ.15లక్షలు వేస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఒక్క రూపాయి అయినా వేశారా అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నిధులను వెనక్కి తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. సుప్రీం కోర్టు స్విస్ బ్యాంక్‌ల్లో డబ్బు దాచుకున్న వారి పేర్లు అడిగితే వాటిని కూడా ఇవ్వలేకపోయారన్నారు. కేవలం అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయనే భయంతో వారి పేర్లను బహిర్గతం చేయడానికి కేంద్రం సాహసించలేకపోయిందన్నారు. మోదీ వస్తే అద్భుతాలు వస్తాయన్న నేతలు ఏం అద్భుతాలు జరిగాయో చెప్పాలన్నారు. పెద్ద నోట్ల రద్దు ఓ అద్భుతమన్నారు. దీనికి తోడు నోట్ల రద్దు పేరుతో నకిలీ నోట్లను కూడా చెలామణి కావడం మరింత అద్భుతమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా నోట్ల రద్దు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారుడు అరవింద సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించడం గమనార్హమన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో జీడీపీ 8 శాతం ఉండాల్సి ఉండగా 6.8 శాతానికి పడిపోయిందన్నారు. రిజర్వు బ్యాంక్‌ను సంప్రదించకుండా ఆర్థిక మంత్రి, ప్రధాని ఏకపక్షంగా ఆర్‌ఎస్‌ఎస్ సూచనలతో పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ డైరెక్షన్‌లో పాలన సాగుతుందన్నారు. నాలుగున్నర సంవత్సరాల పాలనలో మోదీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొడాలి శర్మ, సీపీఐ పట్టణ కార్యదర్శి జంపాన వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు మోదుమూడి రామారావు, వీరబాబు, సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్షుడు చౌటపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.