కృష్ణ

సత్వర న్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సత్వర న్యాయమే లక్ష్యంగా లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో లోక్ అదాలత్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు. ఈ నెల 8న లోక్ అదాలత్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలోని 11 మండల న్యాయ సేవాధికార సంస్థల పరిధిలో 38 బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 56వేల 537 కేసులు ఉండగా వీటిలో 9వేల 500 కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో కృష్ణాజిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమ స్థానంలో ఉందదన్నారు. ఈ విడత కూడా 3వేల 200 కేసులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుని మరోసారి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

పేదరికం లేని సమాజ స్థాపనే ప్రభుత్వ ధ్యేయం

*మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ

మచిలీపట్నం, డిసెంబర్ 6: పేదరికం లేని సమాజ నిర్మాణమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఆదరణ-2 పథకం కింద లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో కలిసి పురపాలక సంఘ పరిధిలోని లబ్ధిదారులకు పని ముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. వివిధ కార్పొరేషన్‌ల ద్వారా అన్ని వర్గాల ప్రజల ఆర్థికాభ్యున్నతికి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన వర్గాలతో పాటు అగ్ర వర్గాల్లోని పేదల సంక్షేమానికి సైతం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. ఆదరణ పథకం ద్వారా బలహీన వర్గాలకు చెందిన చేతి వృత్తిదారులకు యాంత్రీకరణ పని ముట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు.