కృష్ణ

గోదారమ్మను రప్పిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ఎన్ని కష్టనష్టాలనైనా భరించి గోదారమ్మను చింతలపూడి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి రప్పించి ఒక్క ఎకరాను కూడా ఎండనివ్వనని రైతులు అధైర్యపడొద్దని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భరోసా ఇచ్చారు. మండలంలోని పుల్లూరు శివారు దాసుళ్ళపాలెంలో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పధకాన్ని మంత్రి ఉమ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ కేవలం వర్షంపైనే ఆధారపడి పంటలు పండించే మైలవరం మెట్ట ప్రాంత రైతుల బాధలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారాన్ని ఆలోచించి చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని రూపొందించామని, ఇందుకు ఐదువేల కోట్ల రూపాయలు మంజూరు చేయించటం జరిగిందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి రప్పించి ఈ ప్రాంతంలోని పైర్లను సస్యశ్యామలం చేయటంతోపాటు ఏటా రెండు పంటలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకుగానూ మైలవరం నియోజకవర్గంలో 22 ఎత్తిపోతల పధకాలను మంజూరు చేయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 22 ఎత్తిపోతల పధకాల ద్వారా 33 చెరువులకు నీరిచ్చి 7వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ పధకాలు పని చేయటానికి 16 గంటల పాటు విద్యుత్‌ను కూడా అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 4.20 లక్షల మందికి ఆదరణ పధకం ద్వారా పనిముట్లు అందించామని, ఇంకా నాలుగు లక్షల మందికి అందిస్తున్నట్లు తెలిపారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తమ ఉనికికి భంగం కలుగుతుందని కుట్రలు చేస్తున్నారని విపక్షాలపై ఆరోపణలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని అభివృద్ధే ఎజెండాగా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

హోంగార్డుల సేవలు అనిర్వచనీయం

మచిలీపట్నం, డిసెంబర్ 6: పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు అనిర్వచనీయమైనవని జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ అన్నారు. జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో హోంగార్డుల 56వ అవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత హోంగార్డు పతాకాన్ని ఆవిష్కరించిన ఎఎస్పీ సాయికృష్ణ అనంతరం హోంగార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. చంద్రశేఖర్ పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ సాయికృష్ణ మాట్లాడుతూ 1946వ సంవత్సరంలో బ్రిటీష్ పాలన నుండి దేశం విముక్తి పొందుతున్న తరుణంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి రక్షణ కల్పిస్తూ సమాజంలో చెలరేగే అలజడలను శాంతియుతంగా అదుపు చేసేందుకు స్వచ్చందంగా సంస్థగా ఏర్పడిన హోంగార్డు వ్యవస్థ నేడు పోలీసు శాఖలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా వివిధ పోటీ విజేతలకు బహుమతులు అందచేశారు. పెరేడ్‌లో ప్రతిభ కనబర్చిన ఐదుగురు ప్లెటూన్‌లకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ ఎఎస్పీ బి ఢిల్లీ, ఎఆర్ డీఎస్పీ నారాయణరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రామారావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆకుల రఘు, సీఐలు వాసవి, దుర్గాప్రసాద్, ఆర్‌ఐలు కృష్ణంరాజు, నాగిరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు రాజేష్, సతీష్ పాల్గొన్నారు.