కృష్ణ

మేమెట్టా బతికేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మమ్మల్నీ బతకనివ్వండి... ఏ పాపం చేశామని మా కడుపు కొడుతున్నారు. ఇప్పటికే ‘పెంచడం దండగ’ పేరుతో మా జాతి ఉనికికే ప్రమాదం వాటిల్లింది. సేరు పాల కోసం ‘పశువుల్ని పెంచాలా’... రెండు ‘ప్యాకెట్లు’ కొనుక్కుంటే పోలా అని మమ్మల్ని సాకడమే మానేశారు. కాసులకు కక్కుర్తి పడి మా నోటి కాడ కూడు ‘గడ్డి’ వివిధ అవసరాలకు వాడుకుంటూ మా పంటికి దొరక్కుండా చేస్తున్నారు. ఏం పాపం చేశామని మాపై ఇంతలా కక్ష కట్టారు? గతంలో అయితే ఇంటికి ఏ అతిథి వచ్చినా ‘పాడి ఉందా’తో కుశల ప్రశ్నలు మొదలయ్యేవి. నేడు ఆ ఊసే లేదు. ‘పాడి - పంట’... ఇందులో దేనికి లోపమొచ్చినా ‘కరువు’ తప్పదు. ప్రస్తుతం ‘పాడి - పంట’ స్థానంలో ‘సాగు’ పేరుతో ఏదేదో ‘లాభదాయక’ ‘వ్యయ’సాయం పుట్టుకొచ్చింది. కాసుల పంటే గానీ ఎక్కడా పచ్చదనమన్నదే కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేం ఏం తిని బతకాలి... కాలే కడుపుతో ‘క్షీర విప్లవం’ ఎలా సృష్టిస్తాం. ఫలితంగా ‘బక్కచిక్కిన’ తమ కళేబరాలను కబేళాలకు తరలించి ‘్భరం వదిలిపోయింది’ అని చేతులు కడిగేసుకుంటున్నారు. ‘ప్రకృతికి విరుద్ధంగా’ బతకడం నేర్చుకుని ఉన్న వాటిని ఊడగొట్టుకుంటున్నారు. గతంలో అయితే మా కోసమే పిల్లిపెసర, జనుము వంటి వాటిని పైర్లుగా వేసి నిల్వ చేసి మా సంక్షేమం కోసం రైతు ఆరాట పడేవాడు. తెలగపిండి, ఉలవలు నిత్యం మాతో తినిపించి ఆనందపడేవాడు. చిట్టు - తౌడు - బెల్లం మాకు పెట్టి తను తిన్నట్టు భావించి ఉప్పొంగేవాడు. మేము విసర్జించిన ‘పేడ’ను ఎరువుగా వేసుకుని బంగారు పండించుకునే వారు.
మరి ఇప్పుడో మేం తినే గడ్డిని కాగితం, తదితర అవసరాలకు వాడుకుంటూ మా నోటికి చిక్కకుండా చేస్తున్నారు. ఉలవలు, తెలగపిండి, పలు చిరుధాన్యాలు మాకు అందకుండా చేసి మీరే లాగించేస్తున్నారు. మా బతుకులు ఛిద్రం చేసి... మేం తినేది మీరే తినేసి మా కడుపు కొడుతున్నారు. చివరకు మమ్మల్ని కూడా వదిలిపెట్టకుండా వధశాలలకు తరలించి మేమూ మీకు ఆహారంగా మారాల్సి వస్తోంది. కన్న బిడ్డలకన్న మిన్నగా సాకిన రైతు చేతులే మా మెడకు ‘పాశం’గా బిగించి మా ఉనికే లేకుండా చేస్తుంటే మేం ఎవరికి మొరపెట్టుకోవాలి... ఏమని విన్నవించుకోవాలి. రైతులింట దర్జాగా బతికిన మమ్మల్ని ‘జంతు ప్రదర్శన శాల’కు పరిమితం చేస్తారేమోనని భయమేస్తోంది. ఎక్కడైతే పశుసంపద కళకళలాడుతుందో అక్కడ సిరిసంపదలు తులతూగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయే... అటువంటిది మేమూ పురాణాల్లోని పుస్తకాలకే పరిమితమా? చరిత్ర పుటల్లో కలిసిపోవాల్సిందేనా?? మాకు బతకాలని ఉంది... సిరిసంపదలు సృష్టించాలని ఉంది... ప్రాణభిక్ష పెట్టి ‘పసువు నడయాడిన నేల’ సిరులకు నెలవన్నది మరవకండి.
- పశు సంపద