కృష్ణ

పోలీసుల తీరుతో భయం వేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: నూజివీడు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే భయం వేస్తోంది. వీరి నుండి తనకు ప్రాణహాని ఉన్నట్లుగా అనుమానం వస్తోందని నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చెప్పారు. ఆదివారం స్ధానిక ద్వారక ఎస్టేట్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నూజివీడు పోలీసు అధికారుల తీరుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. నూజివీడు పురపాలక సంఘం పరిధిలోని 18 వార్డులో రహదారుల ప్రారంభోత్సవానికి శనివారం వెళ్ళగా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారని, దేశం నాయకులు అడ్డుకునేందుకు పోలీసు అధికారులు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. పది మంది కూడా లేని ఆందోళనకారులకు మద్దతుగా పోలీసుల నిలిచి గంట సేపు తన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేసి, నన్ను నడిరోడ్డుపై నిలబెట్టారని తెలిపారు. నూజివీడు పురపాలక సంఘం పరిధిలోని 30 వార్డులలో 22 వార్డులలో వైకాపా కౌన్సిలర్లు విజయం సాధించారని, రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వందలాది మంది కార్యకర్తలు హాజరైనారని ఆయన వివరించారు. వందలాది మంది కార్యకర్తలు, వైకాపా అభిమానులు ఉంటే కనీసం పది మంది టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు వారికి సహాకరించటం విడ్డూరంగా ఉందని అన్నారు. నేను వైకాపా కార్యకర్తలను రెచ్చగొట్టి ఉంటే అనర్ధం జరిగేదని, ఎంతో సహనంతో నిరీక్షించానని చెప్పారు. పోలీసు అధికారులు వ్యవహారించిన తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళానని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తెలిపారు. ఈవిషయంపై సిఐ రామ్‌కుమార్‌ను వివరణ కోరగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పోలీసు అధికారులపై ఈ విధంగా మాట్లాడటం బాధాకరంగా ఉందని అన్నారు.