కృష్ణ

నిజాన్ని నిర్భయంగా చెప్పడమే అసలైన జర్నలిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నిజాన్ని నిర్భయంగా చెప్పడమే అసలైన జర్నలిజం అని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీబీఐ) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వివిఎస్ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంత పాత్రికేయులకు ఒక రోజు కార్యశాల తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించి వాటిని సానుకూల ధృక్పధంతో ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇటువంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, విధి విధానాలను కలెక్టర్ సోదాహరణంగా వివరించారు. ప్రజా సంక్షేమం నిమిత్తం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు. పతకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలు తదితర సమాచారాన్ని సానుకూల ధృక్పధంతో ప్రజలకు తెలియపర్చాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కూడా మీడియా పాత్ర గణనీయంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాచార వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. అందుకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వానికి, మీడియాకు మధ్య వారధిగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిలుస్తుందన్నారు. ఆదాయ పన్నుల శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ కమిషనర్ ఎం భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని పీఐబీ అందిస్తుందన్నారు. పీఐబీ ఆంధ్రా, తెలంగాణ రీజియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ టివికె రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వీటిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేర వేసేందుకు పీఐబీ కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రాంతీయ మీడియాకు చేరవేయడంతో పాటు స్థానిక స్థితిగతులపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పీఐబీ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకంపై విస్తృత ప్రచారం చేపట్టాలి
కూచిపూడి, డిసెంబర్ 10: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని అదుపుచేసేందుకు గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచులు, సీసాల వాడకంపై సంభవించే దుష్పరిణామాలపై సోమవారం మొవ్వ మండలం కోసూరు, పెదముత్తేవి గ్రామంలో ప్రచార కార్యక్రమానికి జస్టిస్ చలమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సన్‌ప్లవర్ గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ ఎండివిఎస్‌ఆర్ పున్నంరాజు ఆధ్వర్యంలో కోసూరు, పెదముత్తేవి గ్రామాల్లో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ గోనె సంచి పట్టుకుని ప్లాస్టిక్ వ్యర్ధపదార్దాలను సేకరించి పర్యావరణ పరిరక్షణకు ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజెవి పవన్ రాజు, ప్రిన్సిపాల్ జోసఫ్, మహళి ఈశ్వరరాజు, లింగమనేని రామలింగేశ్వరరావు, కూచిపూడి ఎస్‌ఐ బి దుర్గా మహేశ్వరరావు, సన్‌ప్లవర్ ఇంజనీరింగ్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయేతర బృందాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.