కృష్ణ

‘ఎ’ గ్రేడింగ్ దిశగా సేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షల మేరకు ‘ఎ’ గ్రేడింగ్ దిశగా ప్రజలకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో కలెక్టర్ వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎ’ గ్రేడింగ్ సాధనలో ఇప్పటికే జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న 79 సంక్షేమ పథకాలలో జిల్లా 60 పథకాలకు ‘ఎ’ గ్రేడింగ్ వచ్చినట్లు తెలిపారు. ఇదేస్ఫూర్తితో మిగిలిన పథకాల్లో కూడా ‘ఎ’ గ్రేడింగ్ సాధించాలన్నారు. గ్రేడింగ్‌లో వెనుకబడ్డ శాఖాధికారులు లోపాలను సరి దిద్దుకోవాలన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించాలని ఆర్డీవోలను ఆదేశించారు. జిల్లాలో భూ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా 22ఎ జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణతో పాటు 216, 65 జాతీయ రహదారి విస్తరణ, జక్కంపూడి అకడమిక్ సిటీ ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇకపై ప్రతి సోమవారం మీకోసంలో వచ్చే ప్రతి అర్జీని ఐదు రోజుల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. గ్రామదర్శినితో పాటు మీకోసం అర్జీల పరిష్కార చర్యలపై ప్రతి శుక్రవారం సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. ఏ ఒక్క అర్జీదారుడిని నిరుత్సాహపర్చవద్దన్నారు. వారి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను గుర్తించాలన్నారు. ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరో ఐదు రోజుల్లో ఓటర్ల జాబితా సవరణ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయనున్నారన్నారు. ఈ లోపుగా ఓటర్ల జాబితాపై వచ్చిన ప్రతి ఒక్క అభ్యంతరాన్ని పరిష్కరించాలన్నారు. జనవరి 4వతేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలో ఏ చిన్న లోపం ఉన్నా సహించేది లేదన్నారు. ముఖ్యంగా గతంలో ఓటరుగా నమోదైన వారు తాజా జాబితాలో లేనట్లు ఫిర్యాదులు వస్తే ఉపేక్షించనన్నారు. అటువంటి అభ్యంతరాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఉత్తమ ఇఆర్‌ఓగా డ్వామా పీడీ గురుప్రకాష్, గుడివాడ ఆర్డీవో సత్యవాణి ఎంపికయ్యారన్నారు. వీరి ఇరువురు టాప్-10లో స్థానం సంపాదించుకున్నారన్నారు.