కృష్ణ

విశిష్టమైనది తిరుప్పావై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై ఎంతో ప్రసిద్ధమైందని, దీన్ని ధనుర్మాసంలో ప్రతిరోజూ విష్ణువు ఆలయంలో రోజుకొక పాశురం చొప్పున పఠిస్తారని జగద్గురువులు శ్రీశ్రీశ్రీత్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామీజి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జగన్నాథపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. ముందుగా స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆలయ మాజీ చైర్మన్ చలసాని ఇందిరారమణారావు ఇంటి దగ్గర నుండి గోదాదేవి విగ్రహాన్ని రథంపై ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు శ్రీమాన్ వేదాంతం అప్పలాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు చిన్న జీయర్ స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ గోదాదేవి పూలతోటలో విష్ణుచిత్తులకు లభించిన కుమార్తె అని, ఈమెను విష్ణుచిత్తుల దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నారన్నారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత గోదాదేవి రంగనాథుడిని తన పతిగా పొందాలని తలంచిందన్నారు. విష్ణుచిత్తులు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలను అలంకరణగా తీసుకుని వెళ్ళేవారని, అయితే వాటిని గోదాదేవి ముందుగానే ధరించి తర్వాత స్వామివారికి పంపేవారన్నారు. ఈ విషయాన్ని విష్ణుచిత్తులు వారు తెలుసుకుని చాలా దుఃఖించారని, స్వామివారికి మాలాధారణ చేయలేదన్నారు. విష్ణుచిత్తులు బాధను గమనించిన శ్రీవారు ఆయనతో ఇకపై ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశించారన్నారు. ఆ తర్వాత గోదాదేవి తన తోటి బాలికలతో కలిసి తిరుప్పావు వ్రతాచరణ చేస్తారని, ఆ తర్వాత గోదాదేవికి, రంగనాథస్వామికి వివాహం జరుగుతుందన్నారు. వివాహానంతంరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుందన్నారు. రంగనాయక స్వామికి మనసిచ్చిన గోదాదేవి ఆ స్వామిని కీర్తిస్తూ 30పాశురాలను రచించారని, ధనుర్మాస కాలంలో రోజుకో పాశురాన్ని నేటికీ గానం చేస్తూ ఉంటారన్నారు. ధనుర్మాసంలో గోదాదేవిని పూజించడం వల్ల ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నేరవేరతాయని చిన్న జీయర్ స్వామీజీ అన్నారు. అనంతరం చినజీయర్ స్వామీజీకి ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు మెమెంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జీవీ సత్యవాణి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పట్టణ ప్రముఖులు వీరిశెట్టి వెంకట నరసింహారావు, కుందేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.