కృష్ణ

యువత నైపుణ్యాభివృద్ధి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక రామానాయుడుపేటలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రం, సెల్‌ఫోన్ రిపేర్ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సీఎం యువనేస్తం కింద నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయలు భృతిగా ఇవ్వటంతో పాటు వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని యువత నైపుణ్యాభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ హయాంలో ప్రతి ఒక్కరికీ లబ్ధి

నందిగామ, డిసెంబర్ 12: ప్రస్తుత తెలగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వార్డుదర్శిని, వార్డు వికాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని 12వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకటరమణ, నాయకులు చిరుమామిళ్ల చైతన్యకుమార్, కౌన్సిలర్లు మనబోతుల శ్రీరామ, శాఖమూరు స్వర్ణలత, గోపు పూర్ణ పాల్గొన్నారు.

మొవ్వలో 1165 ఉపాధి హామీ పనులు గుర్తింపు

కూచిపూడి, డిసెంబర్ 12: మొవ్వ మండలంలో 2019-20 సంవత్సరంలో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులను గ్రామసభల ద్వారా 1165 పనులను గుర్తించినట్లు ఎపిఓ కె లక్ష్మీరెడ్డి బుధవారం తెలిపారు. బుధవారం ఏపిఓ మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుండి ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పెదముత్తేవిలో 96, మొవ్వలో 95, చినముత్తేవిలో 84, పెడసనగల్లులో 57, వేములమడలో 68, భట్లపెనుమర్రులో 71, కొండవరం, అయ్యంకి గ్రామాల్లో 60 చొప్పున, నిడుమోలు, కాజ గ్రామాల్లో 70 చొప్పున, మొవ్వపాలెం, కోసూరులో 50 చొప్పున, గూడపాడులో 41, అవిరిపూడిలో 44, కూచిపూడిలో 23, పెదపూడిలో 30, బార్లపూడిలో 36, పాలంకిపాడులో 25 పనులు గుర్తించినట్లు తెలిపారు.