కృష్ణ

అగ్రపథంలో జిల్లా విద్యా శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అన్ని అంశాల్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా విద్యా శాఖను రానున్న రోజుల్లో కూడా అదే స్థానంలో కొనసాగించాలన్నదే తన లక్ష్యమని జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లా విద్యా శాఖాధికారిణిగా బాధ్యతలు స్వీకరించి సమర్ధవంతమైన సేవలు అందిస్తున్న ఎంవి రాజ్యలక్ష్మి అభినందన సభను బుధవారం జిల్లా విద్యా శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డీఇఓ ఎంవి రాజ్యలక్ష్మి సేవలను పలువురు ప్రశంసించి ఆమెను గజ మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా శాఖలో అనేక ఉన్నతమైన విభాగాల్లో తాను పని చేసినా జిల్లా డీఇఓగా ఎంతో సంతృప్తి చెందానన్నారు. వేలాది మంది ఉపాధ్యాయులు, వందలాది మంది ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన డీఇఓ బాధ్యతలను అందరి సహాయ సహకారాలతో తాను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఇఓగా తాను జిల్లాకు వచ్చే సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా భయపెట్టారన్నారు. కానీ అటువంటి పరిస్థితి జిల్లాలో ఏ మాత్రం లేదన్నారు. భయంతో పని చేయడం కన్నా ఇష్టంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నది తన ప్రగాఢ విశ్వాసం అన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రసాద బాబు మాట్లాడుతూ ఏ అధికారికైనా కావల్సింది సిబ్బంది సహాయ సహకారాలేనన్నారు. ఆ సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్న డీఇఓ రాజ్యలక్ష్మి అభినందనీయురాలన్నారు. సమావేశంలో ది స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు యంఎ అజీజ్, ఎడీలు సత్యనారాయణమూర్తి, విజయలక్ష్మి, అవధాని, డీవైఇఓలు చంద్రకళ, కమల కుమారి, రవి సాగర్, రవి కిరణ్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ బి లింగేశ్వరరావు, కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ పి లలిత మోహన్, పలువురు సూపరింటెండెంట్‌లు, డీఇఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

వైసీపీ కార్యాలయం ప్రారంభం

జగ్గయ్యపేట, డిసెంబర్ 12: పట్టణంలో నూతనంగా నియోజకవర్గ స్థాయి వైకాపా కార్యాలయాన్ని బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. కోదాడ రోడ్డులో నారాయణ స్కూల్ ఎదురు రోడ్డు ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో వైకాపా విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మైలవరం, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్తలు వసంత కృష్ణ ప్రసాద్, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర అధికారి ప్రతినిధి మొండితోక అరుణ్‌కుమార్, జి కొండూరు ఎంపీపీ తిరుపతిరావు, మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్, నేతలు తన్నీరు నాగేశ్వరరావు, చౌడవరపు జగదీష్, కల్వకుంట్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కార్యాలయం కార్యకర్తలకు 24గంటలు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా సామినేని తెలిపారు.