కృష్ణ

‘సంక్రాంతి’కి పోర్టు పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సంక్రాంతి పండుగ లోపు బందరు ఓడరేవు నిర్మాణ పనులను ప్రారంభించాలని సంకల్పించినట్లు మచిలీపట్నం అర్బన్ డెవప్‌మెంట్ అథారిటీ (ముడ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు. తన ఛాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఓడరేవు నిర్మాణానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముడ కృతనిశ్చయంతో ఉందన్నారు. అందుకు అనుగుణంగానే పోర్టుకు అవసరమైన భూముల కొనుగోలు ప్రక్రియ శరవేగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు భూమి కొనుగోలు పథకం కింద 214 ఎకరాల భూమిని 86 మంది రైతుల నుండి కొనుగోలు చేసి వారి బ్యాంక్ ఖాతాల్లో పరిహారంగా ఎకరానికి రూ.25 లక్షలు చొప్పున రూ.53కోట్లు జమ చేసినట్లు తెలిపారు. పోర్టు నిర్మాణ సంస్థ అయిన నవయుగ కూడా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో పోర్టు పనులు ప్రారంభానికి అవసరమైన మిషనరీ వెళ్లేందుకు రోడ్డు సదుపాయం కావాలని నవయుగ ప్రతినిధులు కోరారన్నారు. ఆ దిశగా రోడ్డు సదుపాయం కల్పనకు ముడ ముందుకు వచ్చిందన్నారు. రెండు మూడు రోజుల్లో నవయుగ సంస్థకు చెందిన భారీ మిషనరీ వెళ్లేందుకు అవసరమైన రోడ్డుకు మార్జిన్ వేస్తామన్నారు. ఆ తర్వాత నవయుగ సంస్థ వారు వారికి కావల్సిన విధంగా తొలుత కచ్చా రోడ్డు నిర్మించుకుని మిషనరీని సముద్రం వద్దకు తీసుకువెళతారన్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ మాసాంతం లేదా జనవరి మొదటి వారంలో పూర్తి చేసి సంక్రాంతి పండుగ నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ముడ ఆధీనంలో ఉన్న 7వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను పారిశ్రామికవేత్తలకు ఉచితంగా కట్టబెట్టే ఆలోచన ముడకు ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఏ పరిశ్రమకు కూడా భూమిని ఉచితంగా ఇచ్చేది లేదన్నారు. ఒక్క కాంకర్ యూనిట్‌కు మినహా మిగిలిన అన్ని పరిశ్రమలకు ఆ ప్రాంత రిజిస్ట్రేషన్ ధర ప్రకారం ఆయా పరిశ్రమలకు ఇస్తామని స్పష్టం ఇచ్చారు. కాంకర్ యూనిట్ ఏర్పాటులో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాలని ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించి అందుకు అనుగుణంగా వెయ్యి ఎకరాల భూమిని ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ మేరకు మాత్రమే కాంకర్ యూనిట్‌కు రైతుల నుండి భూమిని ముడ కొనుగోలు చేసి ఇస్తుందని ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు.

మట్టిరోడ్డు లేకుండా చేస్తాం

జగ్గయ్యపేట, డిసెంబర్ 12: పట్టణంలో ప్రతివార్డులోనూ సీసీ రోడ్లుగా మార్చి మట్టిరోడ్డు అనేది కనిపించకుండా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌టీఆర్ గృహాల శంకుస్థాపనకు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ విచ్చేసినప్పుడు ఆయనకు సమస్యలు దృష్టికి తీసుకురాగా వివిధ పథకాల కింద రూ.24 కోట్ల 28 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లకు రూ.11కోట్ల 08 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేశారని, వీటితో ప్రతి వార్డులో మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. నిరాదరణకు గురైన ధనంబోడు కాలనీలో అంతర్గత రహదారులను, డ్రైనేజీలను నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఐదు కోట్ల ఎస్‌టీ సబ్ ప్లాన్ నిధులు, 3కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రత్యేకంగా కేటాయించామని, త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. శివారు ప్రాంతాలకు సైతం మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని నెరవేరే దశగా పనులు పూర్తి అయ్యాయని, పైపులైన్ నిర్మాణంతో శివారు ప్రాంతాల్లో సైతం మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.45లక్షలతో ఎర్రకాలువ కట్టపై రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వివరించారు. పీఎంఎవై, ఎన్‌టిఆర్ గృహ కల్పలో నిర్మాణం కానున్న 3400 ఇళ్లలో 400 ఇళ్లు ఇంకా ఖాళీ ఉన్నాయని, అర్హులు అర్జీలు దాఖలు చేసుకోవచ్చని అన్నారు. పార్టీలకు అతీతంగా వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే రాజగోపాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, ప్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, పట్టణ పార్టీ అద్యక్షుడు మేకా వెంకటేశ్వర్లు, మైనేని రాధ, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.