కృష్ణ

క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, : తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీర గ్రామాల్లోని క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. మండల పరిధిలో తీరప్రాంత గ్రామమైన ఎదురుమొండిలో శుక్రవారం తుఫాన్ పరిస్థితులపై ఆయన వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ మరి కొన్ని గంటల్లో తీరం చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా సాగునీరు, నిత్యావసర వస్తువులు, వైద్య సదుపాయం, రవాణా సౌకర్యంతో పాటు పడవలను సైతం సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను కోరారు. ప్రజలు శిథిలావస్థకు చేరిన తుఫాన్ షెల్టర్లలో కాకుండా సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు పక్కా భవనాల్లోనే తలదాచుకోవాలని లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు.

తుపాను విపత్తును
ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
* కలెక్టర్ లక్ష్మీకాంతం
పాయకాపురం, : పెథాయ్, భారీ వర్షాల ప్రభావంతో ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులకు ఆదేశించారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుండి పెథాయ్ తుఫాన్ పరిస్థితికి అనుగుణంగా గంట గంటకూ టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ శుక్రవారం అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇండియన్ మెటిరాలాజికల్ డిపార్ట్‌మెంట్, ఇస్రో, నాసా, సైక్లోన్ పై ఫారెన్ బులెటెన్‌లను పరిశీలిస్తూ ట్రాకింగ్ చేస్తున్నామన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, 1100 అలెర్ట్ మెసేజ్ వంటి హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని తుపాను ప్రభావిత పది తీర మండలాల్లోని గ్రామస్థాయి నుండి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెథాయ్ తుఫాన్ సౌత్ ఈస్ట్ ఆఫ్ మచిలీపట్నంకు 1100 కిలో మీటర్లు దూరంలో డీప్ డిప్రషన్ స్థాయిలో ఉందన్నారు. సాయంత్రం 5.30 గంటలకు తుఫాన్ 70 నుండి 80 కిలోమీటర్లు గాలి వేగంతో 15న మచిలీపట్నంకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. 16న భారీ తుఫాన్‌గా ఉదయం 5.30 గంటల నుండి 92 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రభావం ఉందన్నారు. 17న సాయంత్రం 5.30 గంటలకు తుఫాన్ ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉందన్నారు. అదేరోజు ఒంగోలు - కాకినాడ మధ్య ఏ దిశలోనైనా పయనించే అవకాశం ఉందన్నారు. తుఫాన్ ప్రభావిత 10 మండలాల్లో సీనియర్ స్థాయి జిల్లా అధికారులను నియమించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. 181 గ్రామాలు, శివారు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు 4 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సమాచారాన్ని సేకరించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మంచినీటికి ఇబ్బంది లేకుండా జనరేటర్లను, ఆయిల్ ఇంజన్లను సిద్ధంగా ఉంచామన్నారు. 20బోట్లు, 100 మంది గజ ఈతగాళ్లును సిద్ధంగా ఉంచామన్నారు. 3 ఫైర్‌స్టేషన్లను అప్రమత్తం చేయడంతో పాటు ఆస్కో లైట్స్, పోర్టముల్ జనరేటర్లు పొజిషన్ చేశామన్నారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర మందులు, వ్యాక్సిన్‌లు, ఎఎన్‌ఎంలు, ఆషా, గ్రామాల్లో ఆపద మిత్రలు సిద్ధంగా ఉండాలన్నారు. నెట్‌వర్క్ హాస్పటల్స్ సేవలు వినియోగించుకుంటున్నామని, మెడికల్ ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలన్నారు. పశు సంవర్ధక శాఖ పశువులను సైక్లోన్ షెల్టర్లకు తరలించాలని, షెల్టర్లలో నీరు, మేతను, దాణాను సిద్ధణ చేయాలన్నారు. ఖరీఫ్‌లో 45వేల హెక్టార్ల వరిపంట నూర్పిడిలు జరగవలసి ఉన్నందున శని, ఆదివారాల్లో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. 30రోజులకు సరిపోయేలా నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచాలన్నారు. 181 తీరగ్రామాల్లో 46వేల 489 కుటుంబాల్లో 1లక్షా 78వేల 655 మంది ప్రజలు తుఫాన్ ప్రమాదం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. నాగాయలంక, పోడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి గూడూరు, పెడన మండలాలు వీటిలో ఉన్నాయన్నారు. 181 గ్రామాల్లో సముద్ర తీరం నుండి 5 కిలోమీటర్లలోపు 84 గ్రామాల్లో 17వేల 55 కుటుంబాలు, 65వేల 26 మంది జనాభా, 5కిలోమీటర్లు నుండి 10 కిలోమీటర్ల వరకూ 65 గ్రామాల్లో 19వేల 596 కుటుంబాలు, 72వేల 982 జనాభాను తుఫాన్ ప్రభావిత గ్రామాలు, జనాభాగా గుర్తించడం జరిగిందన్నారు. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 1349 మెకనైజ్డ్, మెకనైజ్డ్ బోట్లను సిద్ధంగా ఉంచామన్నారు. 10 ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యాధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. 6 అంబులెన్స్‌లు, మండలాల వారీగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, కలక్టర్ తెలిపారు.