కృష్ణ

జీ ప్లస్ త్రీతో సొంతింటి కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : జీ ప్లస్ 3 గృహ నిర్మాణం ద్వారా పేద వాటి సొంతింటి కలను నిజం చేస్తున్నామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం పురపాలక సంఘం పరిధిలో జీ ప్లస్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను శుక్రవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించారు. జీ ప్లస్ త్రీ గృహాల కోసం డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క నిరుపేదకు గూడు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. అందులో భాగంగానే అర్హులైన లబ్ధిదారులందరికీ జీ ప్లస్ త్రీ గృహాలను కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గంగా ప్రధాన సమస్య అయిన నివేవన స్థలాల సమస్యలను జీ ప్లస్ త్రీ ద్వారా కొంత మేర పరిష్కరించినట్లు తెలిపారు. చల్లపల్లి మొత్తం 3వేల 120 మంది లబ్ధిదారులకు జీ ప్లస్ త్రీ గృహాలను కేటాయించినట్లు తెలిపారు. మరో 3వేల గృహాలను త్వరలోనే లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారు. తొలి విడతగా ఎంపిక చేసిన లబ్ధిదారులచే జనవరి నెలాఖరు లోపు గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. రెండవ విడత లబ్ధిదారులకు మార్చి నెలలో గృహాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

బలహీన వర్గాలకు బలమైన నేత జగన్

మైలవరం, బడుగు, బలహీన వర్గాలకు బలమైన నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎన్ మారేష్ కితాబునిచ్చారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్‌లో మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ)తో కలసి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం అక్కడి నుండి స్థానిక విలేఖర్లతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్నింటా సరైన ప్రాతినిధ్యం లభించటం లేదని, ఓట్ల కోసమే తమను వాడుకుంటున్నారని అన్నారు. బిసిల అభ్యున్నతి కోసం ప్రస్తుత ప్రభుత్వం చేసింది సూన్యమన్నారు. బిసిలలో 139 కులాలుంటే కేవలం 11 కులాలకే ఫెడరేషన్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఈ కారణంగానే బీసీల ఆర్థిక ప్రగతి అణగారిపోయిందన్నారు. బిసిల ఆర్థిక ప్రగతికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. రాబోయే రోజులలు మైలవరం నియోజకవర్గంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపునకు, రాష్ట్రంజలో జగన్‌మోహనరెడ్డి గెలుపునకు బిసి సంక్షేమ సంఘం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

నిమ్మకూరును సందర్శించిన ఎస్పీ

పామర్రు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఈనెల 21న పామర్రు మండలం నిమ్మకూరులో జరగనున్న ఎన్టీఆర్ జీవిత చరిత్రపై నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు చలన చిత్ర ఆడియో ప్రారంభ వేడుకలకు శాంతి భద్రతల దృష్ట్యా సహకరించాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కోరారు. శుక్రవారం నిమ్మకూరులో ఆడియో ప్రారంభ ప్రాంగణాన్ని సందర్శించి పార్కింగ్, వీఐపీల గ్యాలరీ, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలపై సంబంధిత అధికారులతో పాటు గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. టీడీపీ నేతలు, చలనచిత్ర నటులతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని, ఇందుకు ముఖ్యంగా పోలీసులకు అభిమానులు, పార్టీ నేతలు సహకరించాలని ఏస్పీ కోరారు. ఎస్పీతో పాటు పామర్రు సీఐ శివశంకర్, ఎస్‌ఐ రాంబాబు, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.