కృష్ణ

అభివృద్ధికి చిరునామా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: దేశంలో అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్నా అన్ని గ్రామాల్లో నూరు శాతం సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మొవ్వలో రూ.75లక్షల ఎన్‌ఆర్‌ఇజీఎస్ నిధులతో నిర్మించే ఉప ఖజానా కార్యాలయ భవన నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఖజానా శాఖ డీడీ వి నాగ మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ రెండు దశాబ్ధాల కిందట గ్రామ ప్రముఖుడు మండవ బాబూరావు, దాతల సహకారంతో ఎకరం పది సెంట్ల స్థలంలో ఉప ఖజానా కార్యాలయం నిర్మించాలన్న నాటి కలలు రెండు దశాబ్ధాలకు తమ ప్రభుత్వం ద్వారా సాకారమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కిలారపు మంగమ్మ, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, ఉప ఖజానా అధికారి జి సాంబశివరావు, ఎపీఇడబ్ల్యుఐడీసీ ఎఇ సిహెచ్ బాలాజీ, ఖజానా కార్యాలయ జిల్లా అధ్యక్షుడు వై హేమ సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడిదారుల కీలుబొమ్మ చంద్రబాబు

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 15: బీజెపీని బలహీన పర్చడం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల కాదని బీజెపీ పార్లమెంట్ కన్వీనర్ ఆలపాటి లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక బీజెపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పెట్టుబడుదారుల కీలుబొమ్మగా మారారన్నారు. మోదీ సంక్షేమ పథకాలను తన సొంత పథకాలుగా మారుస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకవతకలకు పాల్పడి నిర్మాణంలో జాప్యం జరగటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికీ ప్రాథమిక వివరాలు అందించలేదన్నారు. మరో పోర్టు నిర్మించటానికి ఆయనకు ఇష్టం లేదన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దడం, ఉడాన్ పథకంలో భాగంగా రాజమండ్రి, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంలో కేంద్ర సహకారం లేదా అని ప్రశ్నించారు. నాగాయలంక వద్ద మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ, కర్నూలులో ఎవాల్యుయేషన్ సెంటర్, విశాఖపట్నం జిల్లా రాంబెల్లి వద్ద నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్‌ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. రైల్వే పెట్టుబడులను గణనీయంగా పెంచిందని, నగరాభివృద్ది, గృహ వసతికి గణనీయమైన సహాయం అందించిందన్నారు.