కృష్ణ

జిల్లాకు తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గత రెండు రోజులుగా అన్ని వర్గాలను హడలెత్తించిన ‘ఫెథాయ్’ తుఫాన్ ముప్పు జిల్లాకు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం తుఫాన్‌గా మారి దిశ మార్చుకుంది. నిన్నటి వరకు దక్షిణ దిశగా కొనసాగిన తుఫాన్ శనివారం ఉత్తర దిశగా పయనించి ఒంగోలు-కాకినాడల మధ్య ఈ నెల 17వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ముప్పు తప్పినా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమైన జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తీర ప్రాంత మండలాల్లో ముందస్తు సహాయక చర్యలన్నింటినీ పూర్తి చేశారు. తీర ప్రాంతమైన కృత్తివెన్ను నుండి కోడూరు వరకు అన్ని గ్రామాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు సంసిద్ధులై ఉన్నారు. ఈ తొమ్మిది మండలాల్లోని 164 గ్రామాలు భారీ వర్షాలకు ప్రభావితం అయ్యేవిగా గుర్తించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయిల్ ఇంజన్లు, మోటార్లను సిద్ధం చేశారు. కోడూరు మండలంలో 13 గ్రామ పంచాయతీల్లో 15 జనరేటర్లు, 13 ఆయిల్ ఇంజన్లు, 13 తుఫాన్ హెచ్చరికల సైరన్‌లు ఏర్పాటు చేశారు. 15 రక్షిత మంచినీటి పథకాలను శుభ్రం చేసి పూర్తి స్థాయిలో మంచినీటితో నింపారు. నాగాయలంక మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి 22 ఆయిల్ ఇంజన్లు, 12 సైరన్‌లు ఏర్పాటు చేశారు. 18 రక్షిత మంచినీటి ట్యాంక్‌లను క్లోరినేన్ చేసి నీటి నిల్వలు నింపారు. అవనిగడ్డ మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో 21 రక్షిత మంచినీటి పథకాలను శుభ్రపర్చారు. 19 ఆయిల్ ఇంజన్లు, ఆరు సైరన్‌లను ఏర్పాటు చేశారు. చల్లపల్లి మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో 24 ఆయిల్ ఇంజన్లు, ఆరు సైరన్‌లు ఏర్పాటు చేశారు. 21 వాటర్ స్కీమ్స్‌ను శుభ్రపర్చారు. మోపిదేవి మండలంలో 13 గ్రామ పంచాయతీలకు సంబంధించి 21 ఆయిల్ ఇంజన్లు, ఆరు సైరన్‌లు సిద్ధం చేయగా 16 రక్షిత మంచినీటి పథకాలను క్లోరినేషన్ చేశారు. బందరు మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో 87 ఆయిల్ ఇంజన్లు, 22 సైరన్‌లు ఏర్పాటు చేశారు. 21 రక్షిత మంచినీటి పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. పెడన మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు సంబంధించి 47 ఆయిల్ ఇంజన్లు, 12 సైరన్‌లను సంసిద్ధం చేశారు. 11 వాటర్ స్కీమ్సను పరిశుభ్రం చేశారు. బంటుమిల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో 40 ఆయిల్ ఇంజన్లు, 13 సైరన్‌లు, కృత్తివెన్ను మండలంని 16 గ్రామ పంచాయతీల్లో 18 ఆయిల్ ఇంజన్లు, తొమ్మిది సైరన్‌లను సిద్ధంగా ఉంచారు. అన్ని శాఖల అధికారులు ఆయా గ్రామాల్లో అప్రమత్తమై ఉన్నారు. పంట సంరక్షణ చర్యలపై వ్యవసాయ శాఖాధికారులు రైతుల్ని కలిసి అవగాహన కల్పిస్తున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తీర గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.