కృష్ణ

అప్రమత్తతతో నష్టాన్ని నివారిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పెథాయ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అధికారులంతా సన్నద్దంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి ఆమె తీర ప్రాంత మండల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ వల్ల కలిగే కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి క్షణం అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. తుఫాన్ తీవ్రత వల్ల బందరు మండలం పెదపట్నం, కానూరు, తాళ్లపాలెం గ్రామాలు, కృత్తివెన్ను మండలం తాడివెన్ను, ఇంతేరు, చినగొల్లపాలెం, నిడమర్రు గ్రామాలు, కోడూరు మండలం హంసలదీవి, రామచంద్రపురం గ్రామాల్లోకి సముద్రపు నీరు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల్లో అవసరం మేర ఆయిల్ ఇంజన్లు, జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైతే ఆయా గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సముద్రపు అలలు మూడు మీటర్ల ఎత్తు వరకు రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఇప్పటికే గ్రామాల్లో సిద్ధంగా ఉంచామన్నారు. తుఫాన్‌కు ఈదురు గాలులకు చెట్లు పడిపోయే అవకాశం ఉందని, పోలీస్, ఫైర్, అటవీ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్లు దెబ్బతింటే 24 గంటల్లో పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. రక్షిత మంచినీటి పథకాలన్నింటినీ పూర్తి స్థాయిలో మంచినీటితో నింపినట్లు తెలిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 18వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఆమె తెలిపారు. గాలి వేగం వల్ల ఇళ్లు దెబ్బతినడం, చెట్లు కూలడం వంటివి జరగవచ్చని, అటువంటి నివాసాల్లో ఉంటున్న ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో బస ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోకుండా అవసరమైన టార్ఫాలిన్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జెసీ విజయకృష్ణన్ సంబంధిత పంచాయతీ అధికారులను ఆదేశించారు.

తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

మైలవరం, డిసెంబర్ 15: పెథాయ్ తుఫాను పట్ల రైతులు, అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆయన తహశీల్దార్ ప్రతాప పుల్లయ్య, ఎంపిపి బాణావతు లక్ష్మితో కలసి మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం, పెసలు, మినుములను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీ సిబ్బందిని, ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. రైతులకు అవసరమైన పరదాలు సరఫరా చేయాలని ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా రైతులు తెచ్చిన ధాన్యాన్ని గింజ కూడా మిగల్చకుండా సిబ్బంది కొనుగోలు చేయాలన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం రాత్రి, పగలు తేడా లేకుండా కొనుగోళ్ళు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు జేపి, టీడీపీ నేతలు లీలాప్రసాద్, పంచాయితీ అధికారి రాజేంద్రప్రసాద్, వీఆర్వో పిట్టా దేవప్రియుడు, రైతులు పాల్గొన్నారు. అనంతరం ఈబృందం పుల్లూరు, మొర్సుమిల్లి, తోలుకోడు గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని, అవసరమైన పరదాలను ఏర్పాటు చేయాలని ఆయా కొనుగోలు కేంద్ర సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.