కృష్ణ

అభివృద్ధిని ఆదరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: మీరు పడే కష్టాలు పిల్లలు పడకూడదని, అందుకే పిల్లలను బాగా చదివించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని వెల్లటూరులో టిడిపి అధ్యక్షులు పచ్చిగోళ్ళ రామారావు, దేవినేని ఉమ యూత్ అధ్యక్షులు పచ్చిగోళ్ళ బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామవికాసం, గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఉమకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్ళలో, సిఎస్‌ఐ చర్చి వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో మంత్రి ఉమ మాట్లాడుతూ గోదావరి, కృష్ణానది నీళ్ళను ఒకే గ్రామానికి తెచ్చిన ఘనత టిడిపిదేనన్నారు. సిమెంటు రహదారులను నూరు శాతం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వడం లేదన్నారు. అందుకే తెలుగువాళ్ళ సత్తాను బిజెపికి చూపిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ఎపి నుంచి 25 మంది ఎంపిలను గెలిపించి సిఎం చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతారన్నారు. డబ్బులు మూటలు తెచ్చిన వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. మైలవరం ప్రజలు వేసిన ఓట్లతో తాను మంత్రిని అయ్యి నీటిపారుదల రంగంలో చారిత్రాత్మక ప్రాజెక్టులను నిర్మించామన్నారు. తనపై రానున్న ఎన్నికల్లో పోటీకి వస్తున్న వ్యక్తి 1999లోనే 23వేల ఓట్లతో ఓడిపోయాడన్నారు. తర్వాత అతని తండ్రి కూడా ఓడిపోయాడన్నారు. తర్వాత వీరు హైదరాబాద్‌లో భూకుంభకోణాలకు పాల్పడి వేల కోట్లను దోచుకుని సిబిఐ, ఇడి కేసుల్లో ఉన్నారన్నారు. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ మైలవరంలో కూడా తన వెంట పడుతున్నారన్నారు. వీరికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మైలవరంలో 22 లిఫ్టులు పెట్టి 30 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్న తనపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. చింతలపూడి ద్వారా 2019 జూలైలో సాగునీరు ఇస్తామన్నారు. రానున్న కాలంలో మెట్టప్రాంతంలో రెండు పంటలు పండించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ వుయ్యూరు వెంకట నరసింహారావు, పచ్చిగోళ్ళ రామారావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.