కృష్ణ

ఎస్‌ఐల అభ్యర్థులకు నేడు రాతపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): రాష్టవ్య్రాప్తంగా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 35 కేంద్రాల్లో సుమారు 17,126 మంది అభ్యర్థులకు రాత పరీక్ష జరగనుంది. ఇందుకుగాను ఈనెల 16న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, అదేవిధంగా మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండు విడతలుగా ప్రాథమిక ఎంపిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకుగాను పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను నిర్థారించనున్నారు. పరీక్షల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్ల గూర్చి పోలీసు కమిషనర్ కార్యాలయంలో శనివారం డీసీపీలు బీ రాజకుమారి, డాక్టర్ గజరావు భూపాల్‌లు పోలీసు అధికారులతో సమావేశమై చర్చించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు ఐదు రూట్‌లుగా విభజించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. పారదర్శకంగా, సజావుగా పరీక్షలు సాగేందుకు కొత్తగా ఈ ఏడాది బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. హల్‌టిక్కెట్లు తనిఖీలు పూర్తయి అభ్యర్థులు పరీక్షా హాలులోకి ప్రవేశించిన అనంతరం అభ్యర్థులను బయోమెట్రిక్ విధానం ద్వారా నిర్థారించడం జరుగుతుంది. ట్యాబ్, డివైస్ ద్వారా అభ్యర్థుల నుంచి ఫింగర్ ప్రింట్‌లు సేకరించేందుకు 200 మంది అభ్యర్థులకు ఒక బయోమెట్రిక్ ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేశారు. ఆయా అంశాలపై చర్చించగా ఈ సమావేశంలో అదనపు డీసీపీలు నాగరాజు, బాల వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, ఏసీపీలు, సీఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు.