కృష్ణ

పునరావాస కేంద్రంలో ఆకలి కేకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు: ‘పెథాయ్’ తుఫాన్ నేపథ్యంలో మండల పరిధిలోని పాలకాయతిప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులు ఆకలితో అలమటించారు. సముద్రతీరం వెంబడి, ఉప్పునీటి కయ్యల వెంబడి పీతలు, చేపలను వేటాడి జీవించే యానాదులను రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం ఈ పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే వారి బాగోగులు పట్టించుకోవడం మరిచారు. గూడు కల్పించారే గానీ అన్న పానాదులు పట్ల శ్రద్ధ తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పాలకాయతిప్ప గ్రామానికి వచ్చినప్పుడు మాకు అన్నం పెట్టలేదని యానాదులు మొరపెట్టుకున్నారు. ఆయన అప్పటికప్పుడు డీఎస్పీ పోతురాజును పిలిచి మీరైనా వీరికి భోజన ఏర్పాట్లు చేయండంటూ సూచించారు. పాలకాయతిప్ప పునరావాస శిబిరాన్ని పరిశీలిస్తున్న బాబూరావును పిలిచి వారి ఆకలి సంగతి పట్టించుకోమని సూచించారు. కోడూరు ఎస్‌ఐ ప్రియకుమార్ హుటాహుటి బిస్కెట్లు తెప్పించి మూడు గంటల సమయంలో వారికి అందించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాలు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత రిలీఫ్ క్యాంప్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆగ్రహంతో స్పందించిన అధికారులు అప్పటికప్పుడు అన్నం, కూరలు వండి సాయంత్రం 4గంటలకు బాధితులకు పెట్టారు. ఈ శిబిరంలో దాదాపు 50 మంది ఉండగా చిన్నారులు, వృద్ధులు కలిసి ఆకలికి తట్టుకోలేక గజగజ వణుకుతూ కనిపించారు. తుఫాన్ ప్రత్యేక అధికారి గురుప్రసాద్, తహశీల్దార్ అశ్వర్ధనారాయణరెడ్డి, ఎంఇఓ టివిఎం రామదాసు, డెప్యూటీ తహశీల్దార్ శ్రీ్ధర్‌బాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగవల్లి, వీఆర్‌ఓలు బాబూరావు, సిద్దాబత్తుల నారాయణరావు పునరావాస బాధితులకు స్వయంగా భోజనం వడ్డించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆర్ విక్టర్, కోడూరు మండల ఇన్‌ఛార్జి ప్రత్యేక అధికారి, డీఎల్‌పీఓ ఎండీ రజావుల్లా, ఇన్‌ఛార్జి పోలీసు అధికారి నందిగామ రమణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.