కృష్ణ

రక్షణ వలయంలో ‘తీరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ‘పెథాయ్’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీర గ్రామాలు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు మచిలీపట్నం వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆదివారం కొంత మేర ఊరటనిచ్చాయి. సాయంత్రం 4గంటలకు వాతావరణ శాఖ జారీ చేసిన బులిటెన్ ప్రకారం మచిలీపట్నంకు 570 కిలోమీటర్ల దూరంలో ‘పెథాయ్’ కేంద్రీకృతమైంది. మచిలీపట్నం దిశగా పయనిస్తూ వచ్చిన తుఫాన్ తన దిశ మార్చుకుని విశాఖపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. దీంతో జిల్లాకు తుఫాన్ ముప్పు దాదాపు తప్పినట్టేనని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తతతో వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ముందస్తు రక్షణ చర్యలను చేపట్టినట్లు వివరించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్, ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే ‘మీకోసం’ (గ్రీవెన్స్)ను కూడా కలెక్టర్ రద్దు చేశారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1.6మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ముదినేపల్లి మండలంలో 4.8, అత్యల్పంగా కృత్తివెన్నులో 0.3మి.మిలు వర్షపాతం కురిసింది. తుఫాన్ ప్రభావిత మండలాలైన కృత్తివెన్ను, బందరు, నాగాయలంక, కోడూరు మండలాల్లో 67 పునరావాస కేంద్రాలను గుర్తించారు. ఇందులో 10 కేంద్రాల్లో 473 మందికి పునరావాసం కల్పించి భోజన వసతి ఏర్పాటు చేశారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో 30 మంది చొప్పున 60 మందితో ఎన్డీఆర్ బృందాలు, బందరు, కృత్తివెన్ను మండలాల్లో 20 మంది చొప్పున 40 మందితో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రజల్లో ధైర్యం కల్పించేందుకు గాను ఈ బృందాలు ఆయా గ్రామాల్లో కవాతు నిర్వహించాయి. కలెక్టర్ బి లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ముందస్తు రక్షణ చర్యలను ముమ్మరం చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా తీర గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు.

రెండు లక్షల మంది నిరుపేదలకు పక్కా ఇళ్లు

* ఇంటింటి కుళాయి పోరాటనగర్ నుండే ప్రారంభం * వర్షంలో కూడా గ్రామదర్శినిలో మంత్రి ఉమ

మైలవరం, డిసెంబర్ 16: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రెండు లక్షల మందికి పక్కా ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన మండలంలోని కీర్తిరాయినిగూడెం, పోరాటనగర్, వెదురుబీడెం, కనిమెర్ల, తండాలలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా ఆయన ఆయా ప్రాంతాలలో ప్రసంగిస్తూ మైలవరం నియోజకవర్గంలో వెయ్యి కోట్లరూపాయల విలువ చేసే 12వేల ఇళ్ళ పట్టాలను నిరుపేదలకు ఇస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే 9వేల పట్టాలను అందించామని మిగిలిన వాటిని త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. ఇళ్ళ స్థలాలతోపాటు పక్కా ఇళ్ళను కూడా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. పోరాటనగర్‌లో దశాబ్దకాలంగా ఉన్న కలలను సాకారం చేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్ళుగా రాని 450 ఇళ్ళ స్థలాల పట్టాలను లబ్దిదారులకు స్వయంగా అందించారు. పోరాట నగర్ నుండే ఇంటింటికీ కుళాయి పధకాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో 14 రకాలైన పింఛన్లను అందించటం కోసం 6,500 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత, చేనేత, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. పెద్దకొడుకుగా చంద్రబాబు నెలకు 580 కోట్ల రూపాయలను ఇందుకు వెచ్చిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పెధాయ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని పంట దిగుబడులను కాపాడుకోవాలని మంత్రి ఉమ సూచించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు తుఫాను ప్రాంతాలకు అధికారులను పంపి పరిస్థితులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు ఉమ పేర్కొన్నారు. ఈసందర్భంగా జయహో బిసి కార్యక్రమం ద్వారా బలహీన వర్గాల ఆదరణ-2 పధకం కింద వివిధ వర్గాల వారికి వారి వృత్తులకు సంబంధించి పనిముట్లను మంత్రి ఉమ అందించారు. కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము పార్టీ నేతలు పాల్గొన్నారు.