కృష్ణ

పెథాయ్ నష్టాన్ని అంచనా వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: తోట్లవల్లూరు మండలంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని వివిధ శాఖాల అధికారులు అంచనా వేయాలని సబ్‌కలెక్టర్ మిషాసింగ్ సూచించారు. సోమవారం సాయంత్రం తోట్లవల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షంతో పంట నష్టపోయిన రైతులను గుర్తించి వివరాలు తెలపాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ధ్యానం కొనుగోలు కేంద్రాలను 24 గంటలు తెరిచే ఉంచి మూడు షిప్ట్‌లుగా పని చేయాలని వారికి సూచించారు. రైతులు తెచ్చిన పంటను ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకోవాలని తెలిపారు. తోట్లవల్లూరు మండలంలో 8 హెక్టర్లలో వరి పనలు నీటమునిగాయని వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. అన్ని గ్రామాల్లో విఆర్‌ఓలు మోనేటరింగ్ చేసేలా చూడాలని తహశీల్దార్ జి భద్రుకు సూచించారు.

మైలవరంకు రూ.2కోట్ల ఎస్‌డిఎఫ్ నిధులు: మంత్రి ఉమ
మైలవరం, డిసెంబర్ 17: మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో పలు అభివృద్ధి పనులకు రూ.2కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరైనట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈమేరకు ఎపి ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈనిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. వీటితో అంగన్‌వాడీ భవనాలు, బిసి, ఎస్టీ కమ్యూనిటీ భవనాలు, బిటి, సిసి రోడ్లు, సిడిపిఒ కార్యాలయం, గ్రావెల్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 31 పనులకు ఈనిధులు విడుదల చేశామన్నారు. వీటితో తక్షణమే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన మంత్రి ఉమాకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.