కృష్ణ

మచిలీపట్నం, గుడివాడల్లో మొబైల్ రైతుబజార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశ్యంతో మచిలీపట్నం, గుడివాడలలో మొబైల్ రైతుబజార్లను ప్రారంభించినట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మొబైల్ రైతుబజారును సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. రైతు బజారు రేట్లకు మొబైల్ రైతు బజార్ల ద్వారా కూరగాయల విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తొలుత కలెక్టర్ పట్టణంలోని రైతు బజారును సందర్శించారు. అధిక ధరలకు కూరగాయలు అమ్మే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ పిడుగు బాబూరావు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఎడీ రవి కిరణ్, ఆర్డీవో జె ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

తుఫాన్ వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం లేదు
మండవల్లి, డిసెంబర్ 17: మండలంలో పెథాయ్ తుఫాను వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని, తొమ్మిది గొర్రెలు మృతి చెందినట్లు హౌసింగ్ పిడి ధనుంజయుడు తెలిపారు. మండలంలోని లోకుమూడి, చావలిపాడు, మండవల్లి గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. మండవల్లి రెవెన్యూ కార్యాలయంలో మధ్యాహ్నం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తుఫాను ప్రభావం మన మండవల్లి మండలంలో అంతగా లేదన్నారు. తహసీల్దార్ మధుసూధనరావు మాట్లాడుతూ చావలిపాడులో చలికి తొమ్మిది గొర్రెలు మృతి చెందాయని, మిగిలిన గొర్రెలను ఆ గ్రామంలోని పశువుల సంరక్షణ కేంద్రంకు తరలించామని తెలిపారు. తుఫానుపై అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావంపై సమీక్షీస్తున్నారని ఆయన వివరించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవరం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం పడింది. మండవల్లిలో ఉదయం 6 గంటలకు 11.3 సెం.మీ వర్షం పడినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మండవల్లి, లింగాల, అయ్యవారిరుద్రవరం, కానుకొల్లు, మూడుతాళ్లపాడు, తక్కెళ్లపాడు, ఇంగిలింపాకలంక, ఉనికిలి గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు, కొన్ని చోట్ల గ్రామీణ రహదారులు నీట మునిగాయి. మండలంలో సుమారు 2,200 హెక్టార్ల భూమిలో వ్యవసాయం సాగు చేయగా, వాతావరణ విపత్తు కేంద్రం అప్రమత్తత వల్ల రైతాంగం ముందుగానే పంట నష్టం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా మండవల్లి, గన్నవరం, పెరికేగూడెం, లింగాల, అల్లినగరం, కానుకొల్లు, కొర్లపాడులో కొన్ని ప్రాంతాల్లో వరి పనలు నీట మునిగాయి. కొన్ని చోట్ల సుమారు 80 ఎకరాల్లో వరి కంకులు గాలులకు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంటను సకాలంలో జాగ్రత్త చేసుకోలేకపోయిన కొందరు రైతులు వర్షానికి పనలు నీటి మునగటంతో ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరత, ఆర్థిక ఇబ్బందుల వల్ల పంటను రక్షించుకోలేకపోయమని, చేతి దాక వచ్చిన పంట నోటి దాక రాకుండాపోతుందేమోనని కొం దరు రైతులు ఆందోళన చెందుతున్నారు.