కృష్ణ

అభివృద్ధే టీడీపీ మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : అభివృద్ధే తెలుగుదేశం ప్రభుత్వ మంత్రమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆరవ విడత జన్మభూమిలో భాగంగా చివరి రోజైన శుక్రవారం స్థానిక 39, 40, 41, 42 వార్డులకు సంబంధించి జన్మభూమి కార్యక్రమాన్ని పద్మావతి మహిళా బీఇడీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.200లు ఉన్న పెన్షన్‌ను ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి రూ.2వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. బందరు నియోజకవర్గంలో నివేశన స్థలాల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 6400 మంది వరకు జీ ప్లస్ త్రీ ద్వారా పక్కా గృహాలు నిర్మించి ఇస్తున్నామన్నారు. సమావేశానంతరం ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలకు సంబంధించిన మంజూరు పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి సంబరాలకు నాగాయలంక సిద్ధం

నాగాయలంక, జనవరి 11: స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద పుష్కరఘాట్ వేదికగా నేటి నుండి నాలుగు రోజుల పాటు జిల్లా పర్యాటక శాఖ, గ్రామ పంచాయతీ, స్వచ్ఛ నాగాయలంక, గ్రామాభ్యుదయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు, పడవల పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాలను శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం లాంఛనంగా ప్రారంభిస్తారని, ముఖ్య అతిథిగా ఉపసభాపతి బుద్ధప్రసాద్ పాల్గొంటారని పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ మల్లిఖార్జునరావు, ఎఎంసీ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, స్వచ్ఛ నాగాయలంక అధ్యక్ష, కార్యదర్శులు గడ్డిపాటి సుధీర్‌బాబు, బోయపాటి రాము తెలిపారు. ఉదయం 10గంటలకు నాగాయలంక పొలిమేరలో ఉన్న శ్రీ షిర్డి సాయిబాబా ఆలయం వద్ద నుంచి వివిధ రకాల సాంస్కృతిక కళాకారులతో రూపొందించిన ప్రదర్శనలో కలెక్టర్, ఉపసభాపతి పాల్గొంటారని, ఈ ప్రదర్శన పుష్కరఘాట్ వరకు కొనసాగుతోందని వారు తెలిపారు. 13, 14 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పడవల పోటీలకు ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వారు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, మహిళల కొరకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.