కృష్ణ

అరెస్ట్‌లు, ఆందోళనలు, ధర్నాలతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి-మా వూరు కార్యక్రమం చివరి రోజైన శుక్రవారం మైలవరంలో ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్‌లు, ఆందోళనలు, ధర్నాలతో అట్టుడికింది. ఒక వైపు వైకాపా, మరోవైపు జర్నలిస్టుల ఆందోళనలతో మైలవరం సెంటర్ దద్ధరిల్లింది. జన్మభూమి సభలో ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించటంతో నిరుపేదలకు పెద్ద సంఖ్యలో సభాస్థలికి చేరుకున్నారు. మరోవైపు విపక్ష నేతలైన సీపీఎం నేతలను ఉదయానే్న పోలీసులు అరెస్ట్ చేశారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (కేపీ) తమ అనుచరులతో జన్మభూమి సభకు వచ్చేందుకు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని అడ్డుకున్నారు. ఐనప్పటికీ వారి నుండి తప్పించుకుని తన అనుచరులతో పరిగెత్తుకుంటూ సమీపంలోని జన్మభూమి సభ జరిగే ప్రదేశానికి గోడ దూకి రావటంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిని తేరుకుని పోలీసుల బలగంతో వారిని అడ్డుకుని అక్కడి నుండి పంపివేశారు. ఈ దశలో వైకాపా, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య దాడులు జరిగాయి. ఒకరిపై ఒకరు ఘర్షణకు పూనుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను తరిమివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైకాపా కార్యకర్తలు టీడీపీకి వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను జన్మభూమి సభ వద్ద పంచుతుండగా టీడీపీ కార్యకర్తలు వారిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో కేపీ తన అనుచరులు, పార్టీ నేతలతో కలసి ర్యాలీగా స్థానిక బోసుబొమ్మ సెంటరుకు చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు. ఈ సమయంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు బారులు తీరాయి. ధర్నానుద్దేశించి కేపీ మాట్లాడుతూ ఇళ్ళ పట్టాల పంపిణీ పేరుతో మంత్రి ఉమ పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ళ పట్టాలు ఇస్తున్నట్లు పేదలను నమ్మించి జవాబు పత్రాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్నారు. మంత్రి ఉమ నిజస్వరూపం దీంతో బయటపడిందన్నారు. ఈ దశలో మరో మార్గం ద్వారా మంత్రి ఉమ జన్మభూమి సభకు వచ్చారని సమాచారం తెలుసుకున్న కేపీ తన కార్యకర్తలతో కలసి ర్యాలీగా అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని కేపీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే సమయంలో ఇక్కడికి చేరుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. మంత్రి ఉమ జన్మభూమి సభను త్వరగానే ముగించుకుని రెడ్డిగూడెం మండలం వెళ్ళిపోయిన తర్వాత కేపీని, సీపీఎం నాయకులను విడుదల చేశారు. దీంతో జోగి రమేష్ ఆందోళన విరమించారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

* మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు

మైలవరం, జనవరి 11: మాటిమాటికీ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే మంత్రి దేవినేని ఉమ తానే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు ధ్వజమెత్తారు. జన్మభూమి - మా వూరు కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమని, ఆ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకుని అర్జీలు అందించవచ్చని ప్రభుత్వం నిర్దేశిస్తే మంత్రి ఉమ దానిని కాలరాస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా జరిగే జన్మభూమి పూర్తిగా తెలుగుదేశం నేతలు కనుసన్నలలో నిర్వహిస్తూ ఇతర పార్టీల నేతలను రానీయకుండా అరెస్ట్ చేయటం, పోలీస్‌లతో అడ్డుకోవటం ఎంతవరకు సమంజసమన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. మంత్రి ఉమ ఇక్కడ ప్రజాప్రతినిధిగా పదేళ్ళ కాలం పని చేసి నేటికీ ఒక్క గజం స్థలాన్ని కూడా నిరుపేదల ఇళ్ళ స్థలం కోసం సేకరించకుండా, కనీసం గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొనుగోలు చేసిన తొమ్మిదిన్నర ఎకరాల స్థలాన్ని కూడా పంపిణీ చేయకుండా తాజాగా ఎవరో దాచిపెట్టిన పూరగుట్టను తానే బయటికి తీశానని చెప్పి దానిలో పేదలకు ఇళ్ళస్థలాలు ఇస్తున్నట్లు నిన్నటి వరకూ ప్రగల్బాలు పలికి చివరికి చేతకాక చతికిలపడ్డాడన్నారు. పూరగుట్ట 1974లో రైతుల కోసం 84 ఎకరాలను సేకరించి చెరువు తవ్వాలనుకున్నప్పటికీ సాధ్యం కాక వదిలి వేశారన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు ఇవ్వటానికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఇరిగేషన్ స్థలాన్ని రెవెన్యూ స్థలంగా మార్పు చేయకుండానే పేదలకు ఎలా ఇళ్ళ స్థలాలుగా ఇస్తారని ప్రశ్నించారు. అదేమంటే జవాబుప్రతం పేరుతో ఇళ్ళ స్థలం ఇస్తున్నట్లు పేదలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఈ స్థలం అభివృద్ధి పేరుతో అందులో ఉన్న 40, 50 లక్షల రూపాయల విలువైన కలపను తన అనుచరులతో ఏ శాఖ అనుమతులు లేకుండా యధేచ్ఛగా నరికించి కలపను వేలం వేసి ప్రభుత్వానికి జమ చేయకుండా స్వాహా చేశారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సంబంధిత అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.