కృష్ణ

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక: సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి పండుగ నిలుస్తుందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద పుష్కరఘాట్ వేదికగా జిల్లా పర్యాటక శాఖ, గ్రామ పంచాయతీ, స్వచ్ఛ నాగాయంక సంయుక్త ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సాంప్రదాయ పడవల పోటీలు సోమవారంతో ముగిశాయి. 2వ రోజైన సోమవారం డ్రాగన్ పడవల పోటీలను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రాల సరసన ఇప్పటి వరకు కేరళ రాష్ట్రం అగ్రగామిగా ఉంటోందని నదీ నదాలతో కూడిన సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు నాగాయలంక నిలువుటద్దంగా నిలవటం విశేషమన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం 2017 నుంచి పర్యాటక శాఖ నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో పడవల పోటీలను నిర్వహించటం అభినందనీయమన్నారు. ప్రజలకు తమ దైనందిన జీవితంలో శారీరక, మానసిక ఉల్లాసం కలిగించేందుకు వివిధ రకాల క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, వాటిలో ప్రాచీనకాలం నుంచి ఆచారంగా వస్తున్న సంక్రాంతి సంబరాలు, పడవల పోటీలు వారి జీవన విధానంలో అంతర్భాగంగా వస్తున్నాయన్నారు. ఈ విధమైన కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా పర్యాటక శాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాగాయలంకకు సమీపంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నవ్యలంకలో సైతం సుందరీకరించటమే కాకుండా ఇటువంటి సందర్భాలలో పర్యాటకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయటం ముదావహమన్నారు. సుదూర ప్రాంతాలు నుండి వచ్చే పర్యాటకులకు పర్యాటక శాఖ నవ్యలంకలో అన్ని వసతులతో కూడిన కాటేజిలను నిర్మించటం వల్ల పర్యాటక రంగం పట్ల ప్రజలకు సదాభిప్రాయం ఏర్పడగలదన్నారు. ఇందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పర్యాటక శాఖ మంత్రి భూమి అఖిల ప్రియ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ బి లక్ష్మీకాంతం, పర్యాటక శాఖ అధికారులను చలమేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు.
బ్రాహ్మణ యువకులకు కల్యాణమస్తు పథకం ప్రారంభం
కూచిపూడి, జనవరి 14: కల్యాణమస్తు అనే పథకం ద్వారా రాష్ట్రంలోని అర్చక, పురోహితులైన బ్రాహ్మణ వ ధూ వరులకు ఈనెల 17వ తేదీ నుండి రూ.75వేలు నగదు చెల్లించనున్నట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పివి ఫణికుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వా మివారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురోహతం, అర్చకత్వం నిర్వహించే యువకులకు వివాహం సమస్యగా మారటంతో దీనిని అదిగమించే ందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్యాణమస్తు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెండ్లి కానుకగా రూ.75వేలు అంద చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ అనంతరం వివాహం చేసుకున్న యు వతీ యువకులు ఈ పథకానికి అర్హులన్నారు. సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పామర్రు నియోజకవర్గ కార్యదర్శి కెపిజి శర్మ, ఏలేశ్వరపు ఫణికుమార్, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.