కృష్ణ

క్రీడల్లో మహిళలు రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక: జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలు క్రీడల్లో సైతం తమ ప్రతిభా పాఠవాలను చాటుకొవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఎఎస్ అధికారి ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక శ్రీరామపాదక్షేత్రం వద్ద పుష్కరఘాట్ వేదికగా సోమవారం ఏర్పాటు చేసిన మహిళల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో జరిగిన క్రీడల్లో మహిళలు పతకాలను సాధిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళలు విద్య, ఉద్యోగ రంగాలకే పరిమితం కాకుండా పలు క్రీడా విషయాలు పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, తద్వారా వారి మానసిక, శారీరక, ఆరోగ్య స్థితిగతులను మెరుగుపర్చుకోవటమే కాకుండా ఉద్యోగావకాశాలను కూడా పొందేందుకు దోహదపడతాయని ఆయన హితవు పలికారు. మూడు సంవత్సరాలుగా నాగాయలంకలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంత శాసనసభ్యుడు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కృషితో సంక్రాంతి సంబరాలు, పడవల పోటీలు నిర్వహించటం హర్షణీయమని సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని మహిళా ప్రతినిధి తలసిల స్వర్ణలత పర్యవేక్షించారు.