కృష్ణ

కూత అదుర్స్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సంక్రాంతి బరిలో తొలి రోజు కోడి కూత అదుర్స్‌మనిపించింది. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో తొలి రోజైన భోగి పండుగ నాడు జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు అడ్డూ అదుపు లేకుండా సాగాయి. గడిచిన రెండు మూడు వారాల నుండి కోడి పందాల నిర్వహణపై పోలీసులు జారీ చేసిన హెచ్చరికలు పందెంపు రాయుళ్లకు తాటాకు చప్పుళ్లుగా మారాయి. వేలాది మంది ప్రత్యక్షంగా కోడి పందాల్లో పాల్గొన్నా ఆ వైపు ఏ ఒక్క పోలీసు కనె్నత్తి చూడలేదు. కోడి పందాలను అడ్డుకోవల్సిన పోలీసులు బరుల వద్ద ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. ప్రభుత్వ పెద్దల నుండి పుష్కలంగా ఆశీస్సులు లభించటంతో పందాల నిర్వాహకులు తొలి రోజే కాసులను మూట గట్టుకున్నారు. కోడి కూత, కోత ముక్కతో బరులన్నీ కళకళలాడాయి. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత కోడి పందాలకు కృష్ణాజిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆధునిక హంగులతో నిర్వహించిన కోడి పందాలకు విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుండి వేలాది మంది పందెపు రాయుళ్లు కోడి పందాల్లో పాల్గొని చేతి చమురు వదిలించుకున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బరులన్నీ కళకళలాడుతున్నాయి. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బరుల వద్ద కోట్లలో పందాలు జరిగాయి. మద్యం కూడా అదే రీతిలో ఏరులై పారింది. తాగినోడికి తాగినంత మద్యాన్ని వ్యాపారులు సరఫరా చేశారు. ఇదే అదునుగా భావించి బెల్టు అమ్మకాలను మరింత పెంచేశారు. బరుల వద్దకు వచ్చే పందెపు రాయుళ్ల కోసం నిర్వాహకులు సకల సౌకర్యాలు కల్పించారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో ఏర్పాటు చేసిన బరి జిల్లాలోనే అతి పెద్ద బరి కావటంతో జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పందెపు రాయుళ్లు ఈ బరికి వచ్చి లక్షల్లో పందాలు వేస్తున్నారు. రాత్రి పూట కోడి పందాలు లేకపోయినా కోత ముక్కను కొనసాగిస్తున్నారు. 24గంటల పాటు కోత ముక్క నిర్వహిస్తున్నారు. కోత ముక్క ద్వారానే నిర్వాహకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం పల్లిపాలెం, మునిపెడ, బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట, అర్తమూరు, పెదతుమ్మిడి, ఘంటసాల మండలం కొడాలి, మోపిదేవి మండలం వెంకటాపురం, బందరు మండలం మేకావానిపాలెం, గోపువానిపాలెం, చిన్నాపురం, కైకలూరు మండలం భుజబలపట్నం, కలిదిండి మండలం పోతుమర్రు తదితర గ్రామాల్లో బరులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కోడి పందాలు, పేకాట, గుండాట, చిన్నబజారు, పెద్ద బజారు తదితర జూదాలు నిర్వహించారు.