కృష్ణ

సంక్రాంతి బరిలో నెగ్గిన పందెం కోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో నిర్వహించిన కోడి పందాలు, జూదం ద్వారా రూ.100 కోట్ల మేర చేతులు మారినట్లు సమాచారం. సంప్రదాయ ముసుగులో నిర్వహించిన కోడి పందాలు, పేకాట, చిన్న బజారు-పెద్ద బజారు, గుండాట, నెంబర్లాట తదితర జూద క్రీడలు పండుగ మూడు రోజుల పాటు ఏ మాత్రం నిరంతరాయం లేకుండా కొనసాగాయి. జిల్లాలోని విజయవాడ, బందరు, గుడివాడ, నూజివీడు డివిజన్‌లలో భారీ స్థాయిలో జూదాలు జరిగాయి. న్యాయస్థానాలు నిషేదాజ్ఞలు జారీ చేసినా పందెపు రాయుళ్లు ఏ మాత్రం లెక్క చేయలేదు. ప్రజా ప్రతినిధులే దగ్గరుండి పందాలు వేయటంతో పందెపు రాయుళ్లకు అడ్డు లేకుండా పోయింది. వీటిని నియంత్రించాల్సిన పోలీసు అధికారులు ఆ వైపు కనె్నత్తి చూడకపోవడం గమనార్హం. సంక్రాంతి బరిలో కోడినే గెలుపు వరించింది. ఖాకీలు పూర్తిగా ఓడిపోయారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక మద్యం గురించే వేరే చెప్పనక్కర్లేదు. బరుల వద్ద వెలిసిన బెల్టు దుకాణాల్లో మద్యం ఏరులై పారింది.
‘సంజీవని’ నిర్మాణం
ఆనంద్ సాహసోపేత నిర్ణయం

కూచిపూడి, జనవరి 16: రాష్ట్రంలోని పేరుగాంచిన కార్పొరేట్ వైద్యశాలలను తలపించే విధంగా కూచిపూడిలో సిలీకానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్, నాట్యారామ కమిటీ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ రవిప్రకాష్ సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం నిర్మించటం సహసోపేత నిర్ణయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రశంసించారు. స్థానిక సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ ఫార్మసీ లాభాపేక్ష లేకుండా నాణ్యమైన కల్తీలేని జనరిక్ అండ్ ఎథిలిక్ మందులు తక్కువ ధరకు విక్రయించాలన్న ఆనంద్ కృషి అభినందనీయమన్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాన మంగళవారం సంజీవని వైద్యాలయంలో మెడికల్ ఫార్మసీ, సుమారు రూ.30లక్షల వ్యయంతో మెగ ఇంజనీరింగ్ సంస్థ రూపొందించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అంబులెన్స్‌ను చలమేశ్వర్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ కన్వీనర్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.